Monday, January 31, 2011

తెలుగు సినీ టెక్నీషియన్స్.. నటీనటులపై "అప్పల్రాజు" ఎటాక్


పబ్లిసిటీ స్టంటేమోగానీ అప్పల్రాజు చిత్రంలో ఇండస్ట్రీలోని పలువురు పేర్లను వర్మ పెట్టినట్లు తెలిసింది. దిల్‌రాజు పాత్రను గర్వరాజుగా చూపించినట్లు తెలిసింది. దిల్‌ పేరుతో అన్ని సినిమాలు హిట్లుగానూ, బంగారు లెగ్‌గానూ పరిశ్రమలో చెప్పుకునేట్లుగా చిత్రంలో సన్నివేశపరంగా వెటకారంగా చూపించారని తెలిసింది. ఈ పాత్రను కోట పోషించినట్లు సమాచారం. ఇదే కాకుండా హీరోల డేట్స్‌ను మతలబులు చేసి క్యాష్‌ చేసుకునే అమ్మిరాజు పాత్రను బి.ఎ.రాజుకు చురకలు వేస్తూ చూపించినట్లు సమాచారం. టైటిల్స్‌ వివాదంలో ఒక్కో హీరోను ఎంకరేజ్‌ చేసి ఆ టైటిల్స్‌ను రిజిష్టర్‌ చేసి ముందుగానే లీక్‌చేసే దాన్నుంచి ఆశించేట్లుగా కూడా ఆ పాత్రను మలిచినట్లు సమాచారం.

అదేవిధంగా నాగార్జున, శ్రీనువైట్ల సినిమాలో కాపీ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చక్రిని ఇన్‌డైరెక్ట్‌గా చూపించినట్లు అప్పట్లో గొడవైంది. ఇప్పుడు అటువంటి పాత్రనే మణిశర్మ పాత్రను రెహమాన్‌‌శర్మగా పెట్టి దొంగ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తీర్చిదిద్దినట్లు తెలిసింది.

ఇలా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లను సైతం ఏ ఒక్కరినీ వదలకుండా ఇండస్ట్రీ ఎలా ఉంటుందోననే విషయాలను కొన్ని పాటలద్వారా, కొన్ని సన్నివేశాల ద్వారా చూపించి సరికొత్త ట్రెండ్‌‌కు వర్మ శ్రీకారం చుట్టినట్లు సమాచారం. అప్పల్రాజు విడుదలైతే కనుక ఎంతమందిపై సెటైర్లు ఉన్నాయో తెలుస్తుంది.

No comments:

Post a Comment