Sunday, February 6, 2011

'బంగారు కోడిపెట్ట' రాబోతున్న

మేఘనా నాయుడు ప్రధాన పాత్ర పోషించగా బాలీవుడ్‌లో వచ్చిన ఓ చిత్రం తెలుగులో 'బంగారు కోడిపెట్ట'గా రాబోతోంది. శ్రీ నాగలక్ష్మి ఫిలిమ్స్ పతాకంపై బి. ఫణి ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. అనువాద పనులు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ చిత్రకథను నిర్మాత తెలియజేస్తూ "ఇందులో ఓ సంప్రదాయబద్ధమైన కుటుంబంలో కట్టుబాట్ల మధ్య జీవితాన్ని సాగించే హీరోయిన్‌ని అనుకోకుండా ఓ సందర్భంలో కలిసిన ఓ పెయింటర్ ఆమె హృదయాన్ని మార్చి తన వశం చేసుకుంటాడు. ఇద్దరి మధ్యా శారీరక సంబంధం ఏర్పడి, అన్ని సౌఖ్యాలనీ అనుభవిస్తుంటారు. వారి సంబంధం కొంత కాలం తర్వాత బయటపడుతుంది.

అప్పుడు తీసుకున్న ఓ నిర్ణయం వల్ల వాళ్లు ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? చివరికి కథ ఎలా ముగిసిందన్నది ఆసక్తికరం. ఆ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు యువతరాన్ని ఉర్రూతలూగిస్తాయి. మూడు పాటలు ఉల్లాసాన్ని అందిస్తాయి. ఆద్యంతం ఉత్కంఠభరితంగా, వినోదాత్మకంగా దర్శకుడు కరణ్ రజ్దాన్ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. తెలుగు ప్రేక్షకులు తప్పకుండా దీన్ని ఆదరిస్తారని నమ్ముతున్నాం'' అని చెప్పారు.

షావర్ అలీ, తరుణ్ అరోరా, వరుణ్ వర్ధన్, ముఖేష్ తివారీ, వివేక్ షాఖ్ తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: డాబూ మాలిక్, సినిమాటోగ్రఫీ: రాజేంద్రప్రసాద్.

No comments:

Post a Comment