"నటిగా నిలదొక్కుకున్నాక పుకార్ల గురించి పట్టించుకోకూడదు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు మనగురించి తెలుసుకుంటే చాలు. వీటన్నింటినీ అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరికితే అంతకన్నా కావల్సింది ఏముంటుంది'' అని అంటోంది దీపికా పదుకునే. ఇటీవల ఇమ్రాన్, అవంతిక రిసెప్షన్‌కు హాజరైన దీపిక మాట్లాడుతూ "పెళ్ళి గురించి నాకు ఇప్పట్లో కలలేమీ లేవు.అసలు నేను చేసుకోబోయే వ్యక్తి ఎలా ఉండాలో కూడా నేనెప్పుడూ ఊహించలేదు'' అని చెప్పుకొచ్చింది. అన్నట్టు రజనీకాంత్ తాజా చిత్రం 'రాణా'లో ఈ భామ ఓ నాయికగా ఎంపికైనట్టు కోలీవుడ్ సమాచారం.
No comments:
Post a Comment