Monday, February 7, 2011

ఆమె కోసం క్యూ కట్టిన హీరోస్...

తెలుగు తెరకు ‘ఝమ్మంది నాధం’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన సెక్సీ హీరోయిన్ తాప్సీ నటించిన తమిళ చిత్రం‘ ఆడుకలమ్’ ఈ సంక్రాంతికి విడుదలయ్యి విజయపథంలో దూసుకువెళుతోంది. ఈ చిత్రంలో తాప్సీ అందచందాలు చూసి పలువురు తమళ హీరోలు మనసు పారేసుకున్నారట..తాప్సీని తమ చిత్రంలో కథానాయికగా పెట్టుకోవడానికి సదరు హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం. 
వారిలో శింబు కూడా ఉన్నాడు. తన తదుపరి చిత్రంలో ఎలాగైనా తాప్సీని కథానాయికగా నటింపజేయాలని శింబు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇదిలా ఉండగా సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ చేసి ఈ సినిమా పై రామ్ చరణ్ తేజ్ రీమేక్ చేయాలని మోజుపడి ఆ చిత్ర నిర్మాతతో మంతనాలు జరుపుతున్నట్టు కూడా తాజా సమాచారం.

No comments:

Post a Comment