అల్లరిచిల్లరిగా తిరిగే విద్యార్థులను ఎలా మంచివాళ్లుగా మార్చింది అనేది లవ్ కాలేజ్ కథాంశం. నమిత కాలేజ్ లెక్చరర్‌గా నటిస్తోంది. సారధి స్టూడియోలో, వివిధ కాలేజీలలో టాకీ పార్ట్ జరిగింది. రాకేష్ మాస్టర్ ఆధ్వర్యంలో చివరిపాటను నానక్‌రామ్‌గూడ రామానాయుడు స్టూడియోలో చిత్రీకరించడం జరిగింది. చిత్ర నిర్మాత ఎం.రవితేజరెడ్డి మాట్లాడుతూ.. ‘నమిత ఎంతో బిజీగా ఉన్నా మా కథ విని మాతో ఎంతో సహకరించి అత్యుత్తమ అభినయం ప్రదర్శించింది’ అని తెలిపారు. దర్శకులు జయసింహారెడ్డి ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో కూడిన ‘లవ్‌కాలేజ్’ చిత్రం మార్చి మొదటివారంలో ఆడియో ఆవిష్కరణ జరిపి, చివరివారంలో సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇందులో నమిత, డి.శ్రీకాంత్, పృధ్వీరాజ్, కవిత, అనురాధరెడ్డి, భాస్కర్‌రాజు, దాము తదితరులు నటించారు. కెమెరా: దివాకర్, ఫైట్స్: థ్రిల్లర్‌మంజు, డ్యాన్స్‌మాస్టర్: రాఖేష్, స్టిల్స్: కె.వై.గిరిరాజ్, ఆర్ట్: విజయకృష్ణ, కో-డైరెక్టర్స్, ఎం.రంగా, లక్ష్మణ్, నిర్మాత: ఎం.రవితేజరెడ్డి, కథ-మాటలు-సంగీతం-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: ఎం.జయసింహారెడ్డి.
No comments:
Post a Comment