తన ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రముఖ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ టీవీ9 "రామ్ ధమాల్ వర్మ" అనే కార్యక్రమాన్ని ప్రసారం చేసిందనీ, ఆ కార్యక్రమంలో ఎన్నో తప్పుడు మాటలను సైతం చొప్పించిందని దర్శకుడు రాంగోపాల్ వర్మ మండిపడ్డారు. ఈ విషయాన్ని ఆయన గురువారం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. "ప్రేక్షకులు వెర్రివెధవలు" వంటి కొటేషన్లతో ప్రోగ్రామ్‌ను నడిపిందని తెలిపారు. ఇందుకుగాను టీవీ9 ఛానల్‌పై క్రిమినల్ యాక్షన్ తీసుకుంటానని ఆయన వెల్లడించారు.
No comments:
Post a Comment