Tuesday, March 1, 2011

కెన్యాను ఆటాడుకుంటున్న శ్రీలంక బౌలర్లు!

ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక-కెన్యాల మధ్య వన్డే సమరం ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెన్యా 22 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 73 పరుగులు సాధించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన ఔమా కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించి కులశేఖర బంతికి ఎల్‌బీడబ్ల్యూతో వెనుదిరిగాడు. అలాగే మరో ఓపెనర్ వాటర్స్ కేవలం మూడు పరుగుల వద్ద మలింగ బంతికి ఎల్‌బీడబ్ల్యూతో పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం సీవో ఒబుయా (40), డీవో ఒబుయా (26)లు క్రీజులో ఉన్నారు. తద్వారా 22.6 ఓవర్లలో కెన్యా రెండు వికెట్ల నష్టానికి 76 పరుగులు సాధించింది. శ్రీలంక బౌలర్లలో మలింగ, కులశేఖరలు చెరో వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.

No comments:

Post a Comment