సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కర్టెన్‌రైజర్ మ్యాచ్‌లో సౌత్ సూపర్ స్టార్స్ విజయం సాధించింది. విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో విక్టరీ వెంకటేష్ కెప్టెన్సీ సారథ్యంలోని సౌత్ స్టార్స్ జట్టు 36 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి, 192 పరుగులు సాధించింది. అనంతరం బరిలోకి దిగిన ముంబై హీరోస్ ఆరు వికెట్స నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా విక్టరీ వెంకీ టీమ ట్రోఫీని గెలుచుకుంది.
కాగా విశాఖలో జరిగిన ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్‌ను తిలకించేందుకు భారీ ఎత్తున సినీ ప్రముఖులు, అభిమానులు హాజరయ్యారు. సాగరతీరంలో జరిగిన ఈ మ్యాచ్ స్టేడియం తారలతో మెరిసిపోయింది.
సల్మాన్ ఖాన్ నేతృత్వంలోని ముంబై హీరోస్, విక్టరీ వెంకటేష్ కెప్టెన్ సౌత్ ఇండియా సూపర్ స్టార్‌ల మధ్య జరిగిన ఈ స్టేడియం అందాల తారలు శ్రియ, రాధిక, ప్రియమణి సోనియా అగర్వాల్, సంజన, జెనీలియా, తాప్సిలతో పాటు చీర్ గర్ల్ చిందులతో హోరెత్తింది.

No comments:
Post a Comment