
మొత్తానికి ‘దబాంగ్’ చిత్రం తర్వాత అందరి దృష్టినీ ఆకర్షించిన సోనాక్షిసిన్హా టాప్ హీరోయిన్‌గా సీనియర్ నటీమణులతో పోటీపడుతోంది. తాజాగా ఆమె అక్షయ్‌కుమార్‌తో నటిస్తున్న ‘జోకర్’ చిత్రంలో సన్నగా, నాజూగ్గా కనిపించేందుకు దాదాపు ‘దబాంగ్’ చిత్రంలో కన్నా ఓ పది కిలోల బరువు తగ్గించుకుందట. కాగా ఇప్పుడు సోనాక్షిసిన్హాపై దక్షిణాది నిర్మాతలు, హీరోల దృష్టి పడింది. ఇప్పుడంతా సోనాక్షి జపమే చేస్తున్నారని సమాచారం. ‘జోకర్’ చిత్రం షూటింగ్ సమయంలో కమల్‌హాసన్‌తో తమిళంలో చిత్రాన్ని రూపొందిస్తున్న దర్శకుడు సెల్వరాఘవన్ స్వయంగా సోనాక్షిని కలుసుకుని తన లేటెస్ట్ చిత్రంలో హీరోయిన్‌గా నటించాల్సిందిగా కోరడం జరిగిందని...అందుకు ఆమె అంగీకరించినట్లుగా సమాచారం.
ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా అగ్రహీరోల సరసన నటింపజేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని సమాచారం. ఇప్పటికే బాలీవుడ్ అగ్రహీరోయిన్లకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న సోనాక్షి ఇక తెలుగులో నటిస్తే ఇక్కడున్న హీరోయిన్ల పరిస్థితి ఏమవుతుందోనని కొందరు బాహాటంగానే అనుకుంటున్నారు. పైగా తాజాగా సోనాక్షి పాత్ర పరిధిమేరకు తాను హాట్‌హాట్‌గా నటించేందుకు సిద్ధమే అని ప్రకటించేసరికి ఇప్పుడు నార్త్, సౌత్ నిర్మాతలు సోనాక్షిని తమ చిత్రాలలో నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
No comments:
Post a Comment