
ఎప్పుడూ సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తే మజా ఏముందని అనుకుందో ఏమో బాలీవుడ్ ముద్దుగుమ్మ విద్యాబాలన్... తన లేటెస్ట్ వీడియో క్లిప్పింగులతో కుర్రకారు మతి పోగొడుతోంది. బ్లాక్ అండ్ వైట్‌లో ఉండే ఈ వీడియో షూట్‌లో అమ్మడి అందాలు హాట్ హాట్‌గా దర్శనమిస్తున్నాయి.
పలు రకాల భంగిమల్లో ఉండే విద్యాబాలన్ వీడియో క్లిప్పింగులు ఇంటర్నెట్‌లో జోరుగా దర్శనమిస్తున్నాయి. ముంబైలో స్థానికంగా ఉన్న ఓ రేడియో ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడికి... శ్రోతల నుంచి ఎక్కువ భాగం ప్రశ్నలు ఈ హాట్ షూట్ గురించే వచ్చాయట. వీటిన్నింటికీ కూల్‌గానే సమాధానం ఇచ్చిందట ఈ అందాల తార. ఈ భామ చేతిలో ప్రస్తుతం సిల్క్‌స్మిత జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్న 'ఎ డర్టీ పిక్చర్', తమిళంలో రజనీకాంత్ నటిస్తున్న 'రాణా' చిత్రాలున్నాయి.
No comments:
Post a Comment