![]() |
హిందీ, తెలుగు భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజ్ కుమార్ యాదవ్, కైనాజ్ మోతీవాలా ప్రధాన తారాగణంగా రూపొందుతున్న ఈ చిత్రానికి పవన్ క్రిప్లాని దర్శకత్వం వహిస్తున్నారు. నిజజీవితంలో ఓ ప్రేమ జంట ఎదుర్కొన్న సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్. ఈ చిత్ర విశేషాలను గురించి చెపుతూ ఏక్తా... ముంబై, ఢిల్లీలో జరిగిన వాస్తవ సంఘటనలకు ప్రతిరూపం ఈ చిత్రం. ఎంఎంఎస్ స్కాండల్ నేపథ్యంలో కొనసాగే చిత్రమిది. ప్రతి సన్నివేశం ఎంతో సహజంగా ఉంటుంది. హిందీ, తెలుగు భాషలకు సంబంధించి ఏకకాలంలో షూటింగ్ చేస్తున్నాం. అలాగే విడుదలను కూడా మే 13న ఏకకాలంలో చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.
యూనివర్సల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ఆల్ట్ ఎంటర్ టైన్మెంట్ మరియు ఐరాక్ ఫిలిమ్స్ కూడా ఈ చిత్రానికి సహ నిర్మాణ సంస్థలుగా వ్యవహరిస్తున్నాయి అన్నారు.
No comments:
Post a Comment