నేనే గనుక 90ల్లో పుట్టి ఉంటే... కుర్ర హీరోలను ఆడించేదాన్ని!
కొడుకును చూసి తండ్రి గర్వపడతాడంటారు. కుమార్తెను చూసి తల్లి అలానే ఉండాలంటారు. కానీ నటి రాధ విషయంలో ఇది మరోలా ఉంది. తన కుమార్తె కార్తీకను చూసి రాధ ఈర్ష్య పడుతోందట. స్వయంగా ఆమే ఈ విషయాన్ని చెప్పింది. నా కుమార్తె డాన్స్ చేస్తుంటే చాలా ముచ్చటేసింది. కుర్ర హీరోలతో ఎగురుతుంటే... చాలా ఈర్ష్య పడ్డాను. విదేశాల్లో షూటింగ్ చేసింది. నేను 90ల్లో పుడితే ఈనాటి కుర్ర హీరోలతో డాన్స్‌చేసి ఉండేదాన్నంటూ... మనసులోని మాటను బయటపెట్టింది.
మొదటి సినిమా నాగార్జున కొడుకు నాగచైతన్యతో నటించిన కార్తీక.. రెండవ సినిమాను ఆర్.బి. చౌదరి కుమారుడు జీవాతో నటించింది. జీవా కూడా కార్తీకను చాలా బాగా మెచ్చుకున్నాడు. దీంతో రాధ మాట్లాడుతూ- తాను జీవతో కలిసి నటించాలనే కోరిక ఉందని చెప్పింది. హీరోయిన్‌గానా... అత్తగానా... అమ్మగానా... అమ్మమ్మగానా... అదేదో చెప్పేస్తే నిర్మాతలు రెడీ అయిపోతారు కదా..
No comments:
Post a Comment