రికెట్ వీరులతో బాలీవుడ్ హీరోయిన్ల బంతులాట
ఇపుడు క్రికెట్ సినిమా రేంజ్‌ను దాటిపోయింది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఐపీఎల్ పోటీల్లో తన జట్టు విజయం సాధిస్తే చొక్కా విప్పేసి తన బాడీని చూపిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. హీరోల సంగతి అలా ఉంటే... హీరోయిన్లు క్రికెటర్లను చూస్తే ప్లాటై పోతున్నారు. క్రికెటర్లపై తమ మనసు పారేసుకుంటున్నారు. గ్రీన్ సిగ్నల్ వస్తే చాలు లవ్వాట ఆడేందుకు సై అంటున్నారు. ఎడమచేతి వాటం బౌలర్ జహీర్ ఖాన్ ఇషా శర్వానీని పెండ్లి చేసుకోబోతున్నాడు. ఇంకోవైపు సూపర్ బ్యాట్సమన్ విరాట్ కోహ్లి అందగత్తె సారా జానే దియాస్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని బాలీవుడ్ కోడై కూస్తోంది. మొత్తమ్మీద చూస్తే యువక్రికెటర్లు తారల మోజులో పడుతున్నట్లు తెలుస్తోంది.
ఇక లక్కీ శ్రీశాంత్, బాలీవుడ్ సెక్సీ బ్యూటీ రియాసేన్‌ను వదలి ఉండలేకపోతున్నాడట. ఇటీవల ఎక్కడ మ్యాచ్ జరుగుతున్నా రియాను ప్రత్యేకంగా ఆహ్వానించి తన ఆటను చూపిస్తున్నాడట. అంతేకాదండోయ్ వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా ముదిరి పాకాన పడిందని చెప్పుకుంటున్నారు.
అయితే రియా మాత్రం తమ మధ్య కెమిస్ట్రీ గిమిస్ట్రీ ఏం లేదని కొట్టి పారేస్తోంది. కోచి టీమ్‌కు తాను బ్రాండ్ అంబాసిడర్ కనుక జట్టు సభ్యులతో కాస్తంత చనువుగా ఉన్న మాటమాత్రం వాస్తవమేనని ఒప్పుకుంటోంది. అంతమాత్రాన ఏదో తమ లింకు ఉన్నదంటూ రాతలు రాయడం తగదని అంటోంది రియా. కనుక రియా శ్రీశాంత్ కు లవ్ బౌలింగ్ చేయడం లేదన్నమాట.
No comments:
Post a Comment