Thursday, April 21, 2011

పొట్టి" నిత్యా మీనన్‌తో పొడవు హీరోలకు తంటా



మలయాళంలో నటించిన నిత్యీమీనన్‌ తెలుగు చక్కగా మాట్లాడేస్తోంది. డబ్బింగ్‌ తనే చెప్పుకుంటుంది. తొలి సినిమా "అలా మొదలైంది"లో మంచి మార్కులు కొట్టేసింది. 180 చిత్రంలో సిద్దార్థతో కలిసి నటించింది. మరో రెండు, మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగానూ ఉంది. షూటింగ్‌లో ఆమెను హీరో ప్రక్కన చూపించాలంటే కెమెరామెన్‌ తంటాలు పడాల్సి వస్తుంది. హీరోకు సమానమైన హైట్‌గా చూపాలన్నా, ఇంచుమించుగా కన్పించాలని చేసినా... హీరో కూడా తెగ కష్టపడాల్సి వస్తోంది.

అలామొదలైంది లోనే.. నాని కొన్ని సన్నివేశాల్లో ఆమెతో కలిసి నటించినప్పుడు ఒంగి నటించాల్సి వచ్చిందట. పాటల్లో అయితే మరీ ఇబ్బందికరంగా అన్పించిందట. క్లోజ్‌షాట్‌లో చిన్నపాటి స్టూల్‌ వేసి మేనేజ్‌ చేసేశారు. అయితే ఇవేవీ తన నటనకు ఆటంకంకాదని చెబుతున్నా.. కాస్త ఎత్తుగా ఉంటే ఇలాంటి సమస్యలు వచ్చేవి కావేమోనని చెబుతుంది.

ప్రస్తుతం తను బొద్దుగా ఉందని చాలామంది సన్నిహితులు చెబుతున్నారట. నడుము కూడా ఇంకా సన్నగా ఉండాలంటే.. కాస్త తగ్గాలని తగు చర్యలు తీసుకుంటోంది.

No comments:

Post a Comment