Friday, April 22, 2011

దీపిక ఇలాక్కాదు.. ఇంకా బాగా చూపించాలి: రజినీ



మేకప్ వేసుకోక ముందు జీరో... వేస్కుంటే టాప్ హీరో... దిసీజ్ రజినీ స్టైల్. కెరీర్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర్నుంచీ రజినీకాంత్ అందంగా కనబడేందుకు ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచేవారట. ఇపుడు తాజా చిత్రం రాణా విషయంలోనూ ఇదే రకమైన శ్రద్ధను తీసుకుంటున్నాడట. ఈ మధ్య షూటింగ్ చేస్తున్న సమయంలో తన సరసన నటించేందుకు సింగారించుకుని దీపికా పదుకునే వచ్చిందట. ఆమెను చూసిన రజినీ... షూటింగ్ కట్ చెప్పి పారేశాడట. దీపిక మేకప్ పరమ ఛండాలంగా ఉందని మేకప్ సిబ్బందిపై కోపాన్ని వ్యక్తం చేశాడట. ఆమెను ఇంకా అందంగా చూపించేందుకు అవసరమైన కసరత్తు చేసి రమ్మనమని వారి తెగేసి చెప్పాడట. ఈ పరిణామానికి దీపిక బిక్కచచ్చిపోయిందట. తనేమైనా అందంగా లేనేమో అని భయపడిందట.

రజినీకాంత్ సూచనతో రాణా షూటింగ్ తాత్కాలికంగా బ్రేక్ పడిందట. షూటింగ్ ఆగిపోయినందుకు తానేమీ బాధపడటం లేదని దర్శకుడు కె.ఎస్ రవికుమార్ చెప్పుకొచ్చారు.

No comments:

Post a Comment