Monday, April 18, 2011

"నిత్య"-"నాని"ల మధ్య 'అలా మొదలైంది'!



నిత్యా మీనన్.. నానిల మధ్య ప్రేమాయణం జోరుగా సాగుతున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. అలా మొదలైంది చిత్రంలో ఈ నిత్య (నిత్యామీనన్) నానిలు జంటగా నటించిన విషయం తెల్సిందే. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఈ జంట అందరి దృష్టిని ఆకర్షించింది. అదేసమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. దీనికి మహిళా దర్శకురాలు 'బ్రోకర్‌'గా (మధ్యవర్తిగా) కూడా పని చేసి వారి ప్రేమను సక్సెస్ అయ్యేందుకు తన వంతు సహకారం అందించిందట. ఆ తర్వాత ఇదే జంట తమిళంలో 'సెగ' పేరుతో ఒక చిత్రాన్ని నటించింది.

ఇందులో మరింత దగ్గరైన ఈ ప్రేమ జంట.. అర్థరాత్రి పూట కెమిస్ట్రీ పాఠాలు ఒకరికొకరు చెప్పుకున్నట్టు గుసగుసలు. ఇలా... మొదలైన ఆ ప్రేమ జంట కథ త్వరలోనే కంచికి చేరబోతోందట. కంచికి అంటే తెగతెంపులు కాదండీ... బాబూ.. త్వరలోనే ఈ ప్రేమ జంట ఓ ఇంటివారు కాబోతున్నట్టు సమాచారం.

1 comment: