ఐపీఎల్ నాలుగో సీజన్‌లో అత్యంత విలువైన ఆటగాడిగా లసిత్ మలింగ నిలిచాడు. ఈ సీజన్‌లో స్టార్‌గా మారిన పాల్ వాల్తాటీ రెండో స్థానంలో నిలిచాడు. అయితే తీసుకుంటున్న డబ్బుకు వారి విలువ పరంగా చూస్తే వాల్తాటి అందరినీ వెనక్కునెట్టాడు. మలింగ, వాల్తాటీ తర్వాత జాన్ బోథా, రాబిన్ ఉతప్ప, డగ్ బొలింగర్ నిలిచారు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, కుమార సంగక్కర, యూసఫ్ పఠాన్, జెస్సీ రైడర్‌లు కూడా టాప్ 10 జాబితాలో నిలిచారు. టాప్ 10లో నిలిచిన మిగిలిన ఆటగాళ్లంతా మిలియన్ డాలర్ల ఫీజులు తీసుకుంటుండగా పంజాబ్ ఓపెనర్ అయిన వాల్తాటీ తీసుకునే అధిక మొత్తం 50వేల డాలర్లు మాత్రమే. రాహుల్ శర్మ, అంబటి రాయుడు, ఇక్బాల్ అబ్బుల్లా, సన్నీ సోహల్‌లు తక్కువ మొత్తం తీసుకుంటున్నప్పటికీ విశేషంగా రాణిస్తున్న టాప్10 ఆటగాళ్ల జాబితాలో నిలిచారు. సిద్దార్థ త్రివేది, అశోక్ మనేరియా, అమిత్ సింగ్, ఎం ఎస్ బిస్లా, మొర్తాజాలు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
No comments:
Post a Comment