Friday, May 27, 2011

నేను ఏ మగాడితోనూ తిరగడంలేదు.. రెండేళ్లుగా ఒంటిరిగానే ఉన్నా

బాలీవుడ్ హీరోయిన్లకు ఎఫైర్లు కొత్తేమీ కాదు. బోయ్‌ఫ్రెండ్ పక్కనలేనిదే వాళ్లు ఎక్కడికీ కదలరు. ఇక్కడి హీరోయిన్లు దుస్తులను మార్చినంత తేలికగా బోయ్‌ఫ్రెండ్స్‌ను మార్చేస్తుంటారు. అదేమని అడిగితే సమాధానాన్ని షాక్ ఇచ్చే రీతిలో సమాధానం ఇస్తుంటారు. తాజాగా రియాసేన్ వ్యవహారం కూడా ఇలాగే ఉన్నట్లు కనబడుతోంది. ఎప్పుడూ బోయ్‌ఫ్రెండ్స్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగే రియా ఇటీవల ఓ హోటల్‌లో కనబడితే విలేకర్లు నిలదీశారు. మీరు క్రికెటర్ శ్రీశాంత్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయని అడిగితే... మీరంతగా కంగారు పడవద్దు. నేను గత రెండేళ్లుగా ఒంటరిగానే ఉన్నా. అయినా నేను ఏ మగాడితో మాట్లాడితే ఆ మగాడితో డేటింగ్ చేస్తున్నట్లు కొంతమంది సిగ్గులేని వారు వదంతలు పుట్టిస్తున్నారు.

మాట్లాడినంత మాత్రాన లింకులు పెట్టడమేనా..?" అంటూ ఎగిరెగిరిపడిందట. ఆమె అలా మాట్లాడుతుండగానే.. "పద రియా.. టైం అవుతోంది" అంటూ ఓ అపరిచిత యువకుడు ఆమెను లాఘవంగా పట్టుకోవడాన్ని చూసినవారు నోరెళ్లబెట్టారట.

No comments:

Post a Comment