Sunday, June 5, 2011

జూన్ 24న "సెగ"

కుర్రకారు అంటేనే ఆవేశం. సముద్ర కెరటాల్లా ఉప్పొంగే ఆలోచనలు, అనుభవలేమి వల్లనో, వయసు తొందరపాటు వల్లనో ఆవేశపూరిత నిర్ణయాలకు పాల్పడుతుంటారు. అలాంటి నిర్ణయాలు మున్ముందు జీవితంలో పెనుమార్పులకు కారణభూతమవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే "సెగ" సినిమా ఉంటుంది. క్లాస్ మాస్‌గా వర్గీకరించలేని అత్యద్భుత కథాంశమిది అని దర్శకురాలు అంజన చెప్పారు. నాని, నిత్యామీనన్, బిందుమాధవి కాంబినేషన్లో మనదేశం మూవీస్ పతాకంపై అశోక్ వల్లభనేని నిర్మించిన చిత్రం సెగ.

నిర్మాత మాట్లాడుతూ... చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల 24న తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆడియోకు విశేషాధారణ లభిస్తోంది. జోష్వా శ్రీధర్ సంగీతం ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్. ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్‌కు మంచి ప్రాధాన్యముంది. మా దర్శకురాలు అంజన బ్లాక్ బెల్ట్ హోల్డర్ కావడంతో ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు అని తెలిపారు.  ఈ చిత్రానికి సమర్పణ: మాస్టర్ అచ్యుత్, కెమేరా: ఓంప్రకాశ్, ఎడిటింగ్: ఆంటోని.

No comments:

Post a Comment