సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించే ఆఖరి చిత్రం "రాణా" కావచ్చని ఆయన అల్లుడు యంగ్‌స్టార్ ధనుష్ పేర్కొన్నారు. సినిమాల్లో నటించే అంశంపై రజినీ త్వరలో మీడియాతో మాట్లాడుతారని ధనుష్ చెప్పుకొచ్చారు.రజినీకాంత్ తన 30 ఏళ్ల కెరీర్లో ఇప్పటివరకూ సుమారు 175 చిత్రాల్లో నటించారు. ప్రతి చిత్రంలోనూ తనదైన స్టైల్‌ను చూపెడుతూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ వినోదాన్ని పంచుతున్నారు. ముఖ్యంగా ఆయన సిగార్ వెలిగించే స్టైల్ బహుశా సిల్వర్ స్క్రీన్‌పై ఇంతవరకూ ఎవరూ చేసి ఉండకపోవచ్చునంటే అతిశయోక్తి కాదు.
తన తాజా చిత్రం రాణాకు ముందు రోబో, శివాజీ చిత్రాల్లో నటించి భారతీయ చిత్ర పరిశ్రమలో ఎదురులేని ఏకైక స్ట్రాంగ్ హీరోగా ప్రసిద్ధికెక్కారు. రాణాతో మరోమారు చరిత్ర సృష్టించేందుకు ఆయన తన ఆకృతిపై తీసుకున్న శ్రద్ధే అనారోగ్యానికి కారణమైంది. ఏదేమైనా త్వరలోనే రజినీ కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని ఆశిద్దాం.

No comments:
Post a Comment