Wednesday, July 20, 2011

కత్రినా కైఫా..? ఆమె ఎవరు..?: మనీష్ తివారీ ప్రశ్న

రాహుల్ గాంధీ సగం భారతీయుడని వ్యాఖ్యానించిన కత్రినా కైఫ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. .................
భావిప్రధానిగా చెప్పబడుతున్న రాహుల్ గాంధీని సగం భారతీయుడని కత్రినా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు.

చివరికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారీని ఇదే విషయంపై కదిలిస్తే.. కత్రినా కైఫా..? ఎవరామె..? అంటూ ప్రశ్నలు సంధించారు. ఆమెవరో తమకు తెలియదనీ, అటువంటప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యల గురించి పట్టించుకోవాల్సిన పనేముంది అంటూ ముగించారు.

ఇదిలావుండగా కత్రినా వ్యాఖ్యలపై స్పందిస్తే విషయం మరీ పెద్దదైపోతుందనీ, కనుక ఆమె చేసిన వ్యాఖ్యలపై మౌనాన్ని పాటించడమే మంచిదని కాంగ్రెస్ వర్గాలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే అవకాశం వచ్చినప్పుడు మాత్రం దుమ్ము దులపాలని అనుకుంటున్నట్లు భోగట్టా.

No comments:

Post a Comment