![]() |
"పందెం కోడి" పేరు చెబితే మనకు టక్కున గుర్తుకు వచ్చే పేరు విశాల్. కోలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ తెలుగు హీరో తమిళ సీనియర్ హీరో కుమార్తె, నటి వరలక్ష్మి పేరు చెబితే చాలు చొంగకార్చుకున్నంత పని చేస్తున్నాడట. వరలక్ష్మి తమిళ సినిమాల్లో ఇపుడిపుడే నిలదొక్కుకుంటోంది. సినీరంగంలో అడుగుపెడుతూనే అనేకానేక వివాదస్పద వ్యాఖ్యలు సైతం చేసింది. అంతేకాదు... చేతి కర్చీఫ్‌లను మార్చేసినంత తేలిగ్గా బాయ్ ఫ్రెండ్స్‌ను మార్చేస్తుందన్న వాదనలు ఆమెపై ఉన్నాయి. అయితే ఈ వరలక్ష్మితో కుర్రహీరో విశాల్ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాడని కోలీవుడ్ సినీజం కోడై కూస్తున్నారు.
రాత్రివేళల్లో ఇద్దరూ చాలా పొద్దుపోయేవరకూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారట. ఈ విషయం పెద్దల దాకా వెళ్లడంతో విశాల్ తండ్రి మండిపడ్డాడట. వరలక్ష్మితో కలిసి తిరిగితే ఊర్కునేది లేదని తేల్చి పారేశాడట. ప్రేమ కదా.. అది ముల్లులా గుచ్చుకుంటుంది. అందుకనే విశాల్ మాత్రం వరను విడిచి ఉండలేకపోతున్నానని చెపుతున్నాడట.
అదేమని అడిగిన వారితో, తమది చిన్ననాటి స్నేహమనీ, వరలక్ష్మి తాను చిన్నప్పట్నుంచే స్నేహితులం కనుక కలిసి మాట్లాడుకోవడం, చర్చించుకోవడం చేస్తుంటామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడట. మరీ అంత పొద్దుపోయేదాకా ఏం చర్చలమ్మా... అని కొంతమంది విశాల్ ను వెక్కిరిస్తున్నారట.

No comments:
Post a Comment