Thursday, August 18, 2011

హీరోతో చర్చించాల్సినవి లక్షా తొంభై ఉంటాయ్.. అవన్నీ చెప్పాలా..?

బాలీవుడ్ సెక్స్‌బాంబ్ బిపాసను అతుక్కుపోయినట్లు తిరిగే జాన్ అబ్రహాం కొత్తగా మరో అమ్మాయిని బుట్టలో వేసినట్లు బాలీవుడ్ భోగట్టా. ఇంతకీ ఎవరా అమ్మాయి అని ఆరా తీస్తే షాకింగ్ న్యూస్ బయటకొచ్చిందట.

ఆ అమ్మాయి మరెవరో కాదనీ, కేరళ కుట్టి అయిన అసిన్ అని తేలిందట. హౌస్‌ఫుల్ 2 చిత్రంలో జాన్ సరసన నటించిన దగ్గర్నుంచి వీళ్లద్దరి మధ్య కెమిస్ట్రీ మొదలైందట. ఎంతగా ముదిరిపోయిందంటే... ఎన్నడూ బిపాసను వదిలిపెట్టి ఉండలేని జాన్ అబ్రహాం ఇటీవల నాలుగు మూడు రోజులకోసారి బిపాస వద్దకెళుతున్నాడట. దీంతో అసిన్‌పై బిపాసా కారాలు మిరియాలు నూరుతున్నట్లు సమాచారం.

ఇదే విషయాన్ని అసిన్ వద్ద ప్రస్తావిస్తే, జాన్ అబ్రహాంతో ఒక హీరోగా మంచి పరిచయముందని చెపుతోందట. అంతేకాదు... ఒక హీరో - హీరోయిన్ కలిసి సినిమా చేస్తున్నప్పుడు చర్చించుకోవాల్సిన విషయాలు లక్షా తొంభై ఉంటాయనీ, అవన్నీ ఎవరికీ చెప్పాల్సిన పనిలేదని బుకాయిస్తోందట. దీనిబదులు తమిద్దరి మధ్య ఎటువంటి కెమిస్ట్రీ లేదని సూటిగా సుత్తి లేకుండా చెప్పవచ్చు కదా..!!

No comments:

Post a Comment