Friday, September 2, 2011

  1.  చిరంజీవి నటవారసునిగా టాలీవుడ్‌కు పరిచయమైన "తమ్ముడు" పవన్‌ కళ్యాణ్‌. మేనరిజంలోనూ డైలాగ్‌లోనూ బాడీ లాంగ్వేజ్‌లోనూ తనదైన ప్రత్యేక ప్రతిభను కనబర్చిన పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు సెప్టెంబర్‌ 2. శుక్రవారం. 'ఇక్కడమ్మాయి అక్కడబ్బాయి' చిత్రంతో కెరీర్‌ను ప్రారంభించిన పవన్‌కళ్యాన్‌‌కు సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి చిత్రాలు మంచిపేరు తెచ్చాయి.
  2. 'ఖుషీ' చిత్రం పవన్‌ అభిమానులతో పాటు పవన్‌ కెరీర్‌ను ఖుషీ చేసింది. ఒక్కసారిగా యూత్‌ ఫాలోయింగ్‌ చిరంజీవి నుంచి పవన్‌కు మారిపోయింది. క్రమేణా చిరంజీవి కూడా నటుడిగా గ్యాప్‌ ఇచ్చాడు. ఖుషీ సక్సెస్‌ తర్వాత చిరంజీవి మళ్ళీ తెరపైకి వచ్చాడు. అయితే పెద్దగా సక్సెస్‌ కాలేదు. పవన్‌ తన అన్నను స్పూర్తిగా తీసుకుని డాన్స్‌లో కొత్త కోణాన్ని ఆవిష్కరించారు.
  3. ముఖ్యంగా ఫైట్స్‌లో క్రేజ్‌ను సృష్టించాడు. కరాటే, కుంగ్ఫూ వంటి యాక్షన్స్‌ను స్వతహాగా చేసేవాడు. తన చిత్రాల్లో ఒరిజినల్‌ ఫైట్స్‌ చేసి మెప్పించాడు. హీరోల్లో శ్రీహరి తర్వాత ఒరిజినల్‌ ఫైట్లు పవన్‌ చేస్తాడనే ముద్ర ఏర్పర్చుకున్నాడు. అయితే ఆయనలో ఉన్న మరో కోణం దర్శకుడు. దర్శకత్వంలో తన సత్తా నిరూపించుకోవాలని 'జానీ' తీశాడు. అది నిరాశాపర్చింది. ఆ తర్వాత వచ్చిన 'గుడుంబా శంకర్‌' కూడా మోస్తరుగా ఆడింది.
  4. ప్రేమకోసం పరితపించే వ్యక్తిగా 'బాలు'లో కన్పించినా మరో కోణం యాక్షన్‌పై శ్రద్ధపెట్టడం. ఆతర్వాత 'బంగారం', 'అన్నవరం' చిత్రాల్లో సెంటిమెంట్‌తో సాగాడు. అయినా పెద్ద పేరుతేలేకపోయింది. ఆ తర్వాత వచిచన 'కొమరం పులి' పూర్తి నిరాశకు గురిచేసింది. తీన్‌మార్‌ అంటూ వచ్చిన అంత రేంజ్‌ చేకూర్చలేకపోయింది. మొత్తమ్మీద హిట్లకోసం ఎన్నో ట్రిక్కులు వేసిన పవన్‌కు సరైన హిట్‌ లేకపోయింది.
  5. ఇప్పుడు పవన్‌ ట్రెండ్‌ మార్చాడు. వినోదానికి పెద్దపీట వేయాలనే కొత్త తరహా చిత్రాలను చేస్తున్నాడు. స్వతహాగా మీడియాకు దూరంగా ఉండే పవన్‌... అన్న రాజకీయపార్టీ నుంచి మరింత దూరమయ్యాడు. తాజాగా గణేష్‌ నిర్మాతగా 'గబ్బర్‌సింగ్‌' చిత్రం తయారవుతోంది. ప్రస్తుతం ఆర్కా మీడియా పతాకంపై కె. రాఘవేంద్రావు మేనల్లుడు యార్లగడ్డ శోభు నిర్మిస్తున్న చిత్రం చేస్తున్నారు. విష్ణువర్థన్‌ దర్శకుడు.
  6. కోల్‌కత్తా నేపథ్యంలో సాగుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ఫిలింసిటీలో సెట్‌ వేసి మరీ తీస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు అభిమానుల్లో ఉన్నాయి. పవన్‌లోనూ ఉన్నాయి. ఈ చిత్రానికి 'పవర్‌' పేరు పరిశీలనలో ఉంది. ఆ పవర్‌ ఏమిటో చూడాలంటే డిసెంబర్‌ వరకు ఆగాల్సిందేనని పవన్‌ సన్నిహితులు చెబుతున్నారు.

No comments:

Post a Comment