Monday, September 5, 2011

రాంగోపాల్ వర్మను మించిన "డర్టీ పిక్చర్" ఏక్తా కపూర్

ఇప్పటివరకూ సంచలనాత్మక చిత్రాలంటే రాంగోపాల్ వర్మ పేరునే చెప్పుకోవడం జరుగుతుండేది. కానీ ఇపుడా ఇమేజ్‌ను సీనియర్ బాలీవుడ్ నటుడు జితేంద్ర కుమార్తె ఏక్తా కపూర్ ఎగరేసుకెళ్లేట్లు కనబడుతోంది. సిల్క్ స్మిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని డర్టీ పిక్చర్ తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది ఏక్తా.

రాంగోపాల్ వర్మ బెజవాడ, ఇది ప్రేమకథ కాదు, రక్త చరిత్ర వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తే ఏక్తా కపూర్ మాత్రం సెక్స్ సంబంధమైన విషయాలను, రొమాంటిక్ సంబంధాలను తెరకెక్కిస్తూ సంచలన చిత్రాల నిర్మాతగా పేరు తెచ్చుకుంటోంది. ఇప్పటికే "లవ్ సెక్స్ ఔర్ ధమాకా", "రాగిణి ఎంఎంఎస్" వంటి చిత్రాలను నిర్మించిన ఏక్తా ఇపుడు డర్టీ పిక్చర్‌తో మరోసారి టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయ్యింది.
ప్రస్తుతం సిల్క్ స్మిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న డర్టీ పిక్చర్‌లో స్మిత పాత్రలో నటిస్తున్న విద్యా బాలన్ పోస్టర్లు, ట్రెయిలర్లను చూస్తుంటే కుర్రకారు హాట్ బీట్ పెరిగిపోవడం ఖాయం అంటున్నారు సినీజనం.

No comments:

Post a Comment