Thursday, September 22, 2011

రజనీకాంత్‌కి "రామోజీ" సెంటిమెంట్‌ ఉన్నదట

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు రామోజీ ఫిలింసిటీ అంటే సెంటిమెంట్‌ ఉందని తెలిసింది. ఎందుకంటే రజనీకాంత్‌ తండ్రి పేరు రామోజీరావు. అందుకే తన సినిమాలకు చెందిన ఒక్క షెడ్యూల్‌ అయినా అక్కడ చేసేలా ప్లాన్‌ చేస్తుంటాడని ఫిలింసిటీ వర్గాల కథనం................ఆ సెంటిమెంట్‌తో తాజాగా 'రాణా' షెడ్యూల్‌ అక్కడ చేయబోతున్నారు. ఆ సినిమా కోసం ఒక ప్యాలెస్‌ సెట్‌, ఒక షిప్‌ సెట్‌ వేశారు. అక్టోబర్‌ 3 నుంచి షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది.

రజినీ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని వందరోజులు షూటింగ్‌ ప్లాన్‌ చేశారు దర్శకుడు కెఎస్‌. రవికుమార్‌. ఈ చిత్రంలో దీపికా పడుకొనే, సోనూసూద్‌ కూడా అక్టోబర్‌ 3నే షూటింగ్‌లో పాల్గొననున్నారు.

No comments:

Post a Comment