Monday, September 12, 2011

నిఖిత-దర్శన్ ఎఫైర్: నిఖితపై కన్నడ పరిశ్రమ మూడేళ్ల నిషేధం

'కళ్యాణ రాముడు', 'సంబరం' తదితర చిత్రాల్లో నటించిన హీరోయిన్ నిఖితపై కన్నడ పరిశ్రమ మూడేళ్ల నిషేధం విధించింది. తెలుగులో అవకాశాలు లేకపోవడంతో........... మాతృభాష కన్నడం వైపుకు వెళ్లిన నిఖిత కన్నడ హీరో, దర్శకుడు దర్శన్‌తో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయింది. ఫలితంగా దర్శన్ తన భార్య విజయలక్ష్మిని పట్టించుకోకపోవడమే కాక అప్పుడప్పుడు భౌతికంగా ఆమెను బాధించడం మొదలెట్టాడు.

ఈ గొడవలు చివరకు దర్శన్‌ను పోలీసులు అరెస్టు చేసే స్థాయికి వెళ్లాయి. గత కొంతకాలంగా దర్శన్-విజయలక్ష్మిల కాపురంలో చిచ్చుపెట్టిన నిఖిత.. తాజాగా దర్శన్‌ను పెళ్లిచేసుకోవాలన్న తలంపుకు వచ్చింది. దీనికి దర్శన్ కూడా సమ్మతించినట్టు సమాచారం.

ఈ విషయం విజయలక్ష్మికి తెలియడంతో ఏమాత్రం అంగీకరించలేదు. దీంతో వారి మధ్య ఘర్షణలు చెలరేగి విజయలక్ష్మిని బలంగా గాయపరిచాడు. దీంతో ఆమె బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్శన్‌ను అరెస్టు చేశారు. అక్కడ మీడియా దీన్ని హైలెట్ చేసింది. నిఖిత కారణంగా దర్శన్-విజయలక్ష్మి కాపురంలో చిచ్చురేగిందని కోడైకూస్తోంది.

ఈ నేపథ్యంలో నిఖిత మాట్లాడుతూ తనకు దర్శన్‌కు వివాహేతర సంబంధం లేదన్నారు. అయితే, తామిద్దరం మంచి ప్రేమికులమని, తన కోసం దర్శన్ ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని చెప్పారు. అయితే, వారిద్ధరు మాత్రం ఎందుకు కొట్టుకున్నారో తనకు మాత్రం తెలియదని నిఖిత ఏమీ తెలియనట్టు చెపుతోంది.

No comments:

Post a Comment