నేను
ఇద్దరు కుర్రాళ్ళను శనివారం రాత్రి కొట్టానని అంటున్నారనీ, అది నిజం
కాదనీ, వారు నాపై లేనిపోని అంభాండాలు వేస్తున్నారని హీరో నవదీప్
తెలియజేశారు. ఇదంతా తెలంగాణా ఇష్యూలో భాగంగానే కొంతమంది నాపై ఇలా
దుష్ప్రచారం చేస్తున్నారని తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. అయితే దీనికి
సంబంధించిన పోలీసు కథనం ఇలా ఉంది...ఇటీవల
మద్యం మత్తులో హీరో నవదీప్ చాలాసార్లు గొడవలు చేశాడు. శనివారం రాత్రి
కూడా అదే పునరావృతమైంది. ఆ రోజు దిల్‌రాజు నిర్మించిన 'ఓ మై ఫ్రెండ్'
సినిమా ఆడియో వేడుకలో పాల్గొన్నాడు. స్టేజీపై ఓ స్కిట్ కూడా ప్లే చేశాడు.
కుర్రకారు అమ్మాయి వెంటపడడం... ఆమెను తిరస్కరించడం.. ఆ తర్వాత చాక్లెట్
ఇస్తే... కాదనడం.. ఇలా ఓ అమ్మాయితో కలిసి స్టేజీపై నవదీప్ ప్లే చేసిన
స్కిట్‌కు సభకు హాజరైన కాలేజీ విద్యార్థుల నుంచి మంచి రెస్సాన్స్
వచ్చింది.
ఆ ప్రోగ్రామ్ అనంతరం ఓ హోటల్‌లో దిల్‌రాజు శ్రేయోభిలాషులకు, చిత్రయూనిట్‌కు పార్టీ ఇచ్చాడు. అక్కడకు వెళ్ళిన నవదీప్ మరో స్నేహితురాలు తిరిగి వస్తుండగా.. మాదాపూర్‌లో ఐస్క్రీమ్ పార్లర్ దగ్గర గొడవ చేశాడు.
వివాదానికి కారణమైన నవదీప్‌తో పాటు ఉన్న యువతి ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న వ్యక్తి కుమార్తె. పోలీసుస్టేషన్‌లో తాను మంత్రి కుమార్తెనని పరిచయం చేసుకుందని తెలిసింది. మాదాపూర్ డీసీపీ మనీష్‌కుమార్ సిన్హా ఈ కేసును పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

No comments:
Post a Comment