Tuesday, October 18, 2011

న్యూడ్‌గా వద్దు.. సెమీ న్యూడ్‌గా కనిపించేందుకు సై!

lakshmi prasanna
కొంతమంది సినిమా హీరోయినల్లు ఆఫర్లు లేక పోవడంతో ఏదో విధంగా పబ్లిసిటీని మూటగట్టుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. వారు చేసే చేష్టలు వివిధ రూపాల్లో ఉంటాయి.... అవి వివాదాస్పద వ్యాఖ్యలు కావొచ్చు లేదా.. మ్యాగజైన్లకు న్యాడ్‌గా ఫోజులు ఇచ్చేందుకు కావొచ్చు.. ఇలా ఏదో విధంగా సంచలనం సృష్టించేందుకు తాపత్రియ పడుతుంటారు.

ఈ కోవలో టాలీవుడ్ అగ్రహీరోయిన్‌గా పేరొందిన కాజల్ అగర్వాల్ ఒక పత్రికకు న్యూడ్‌‍గా ఫోజు ఇచ్చి సంచలనం సృష్టించారు. ఇది ఆమెకు మంచి పబ్లిసిటీ ఇవ్వడమే కాకుండా.. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర దర్శక నిర్మాతలను సైతం తమ వైపుకు తిప్పుకుంది. ఈ తరహా ప్రచారంలో కొందరు సక్సెస్ సాధిస్తుంటే.. మరికొందరు ఉన్నది కాస్త పోగొట్టుకుని ఇంటికే పరిమితమవుతున్నారు.

ఫిల్మ్ నగర్ వర్గాల తాజా సమాచారం మేరకు.. సినీ నటుడు డాక్టర్ మోహన్ బాబు ముద్దుల కుమార్తె మంచు లక్ష్మీప్రసన్న సెమీ న్యూడ్‌గా ఎఫ్‌హెస్ఎం పత్రికకు ఫోజు ఇచ్చేందుకు సిద్ధవుతోందట. ప్రస్తుతం బాలీవుడ్‌లో రూపొందుతున్న 'డిపార్టుమెంట్' చిత్రంలో నటిస్తున్న లక్ష్మీ బాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు దక్కించుకునేందుకు ఈ దారి ఎంచుకుందట.

తండ్రి నుంచి నటనా వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న లక్ష్మీ అమెరికాలో ఉన్నప్పటి నుంచే ఆ రంగంపై ఆసక్తి పెంచుకుంది. గతంలో అమెరికాలో కొన్ని సీరియల్స్‌లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. తిరిగి ఇండియాకి వచ్చి తెలుగులో ఓ టీవీ ఛానల్‌లో టాక్ షో ద్వారా తెలుగువారి అభిమానం చూరగొంది.

మోహన్ బాబు కూతురు కాబట్టి తెలుగులో త్వరగా క్లిక్ అయింది. మరి బాలీవుడ్‌లో క్లిక్ కావాలంటే ఏదో కొత్తది చేయాల్సి ఉంటుంది. వందల మంది స్టార్స్ పోటీ పడే అక్కడ కేవలం నటన, అందం ఉంటే సరిపోదు. సంచలనాలు సృష్టిస్తూ ముందుకు సాగాలి. వార్తల్లో చర్చనీయాంశం కావాలి. మరి అలా కావాలంటే ఎఫ్‌హెచ్‌ఎం మ్యాగజైన్‌పై సెమీ న్యూడ్ షో సరైన మార్గమని మంచు లక్ష్మీ భావిస్తోందని సమాచారం.

No comments:

Post a Comment