మహేష్ బాబు తాజా చిత్రం ది బిజినెస్ మ్యాన్ లో ఐటం గర్ల్ గా హన్సిక ను
ఎంపిక చేసారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆమె తానేమీ
ఆ చిత్రంలో చేయటం లేదని ప్రకటన ఇచ్చింది.అయితే ఇప్పుడా ఐటం సాంగ్ ఎవరు
చేస్తున్నారు అని ఎంక్వైరీ చేస్తే బాలీవుడ్ బ్యూటీకి ఆ ఆఫర్ దక్కిందని
విశ్వసనీయ సమాచారం.......
ఆమె ఎవరో కాదు..శ్వేతా భరధ్వాజ్. ఈమె బాలీవుడ్ లో మిషన్
ఇస్తాంబుల్ అనే సినిమాతో పరిచయమయ్యింది. ఆ తర్వాత గోవిందా లూట్ సినిమాలో
నటించింది.ఇప్పుడు బిజినెస్ మెన్ ఐటం సాంగ్ చాన్స్ తో టాలీవుడ్ లో
ప్రవేశించనుంది.ఇక ఇంతకుముందు పోకిరిలో ఐటం సాంగ్ చేసిన ముమైత్ ఖాన్ ఎంత
వెలుగు వెలిగిందో తెలిసిందే. దాంతో ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ అనగానే అంతా
ఆసక్తి చూపుతున్నారు. మహేష్ కెరీర్ లోనే ఎన్నూ లేనంత స్పీడు గా ఈ సినిమా
షూటింగ్ జరుపుకోవటం విశేషం. ఇక బిజినెస్ మెన్ కోసం థమన్ ఓ పక్క సాంగ్స్
రీకార్దింగ్ జరుగుతూంటే మరో పక్క వాటి షూటింగ్ కూడా జరిగిపోతుంది. ఇప్పటికి
థమన్ మూడు పాటలు రికార్డ్ చేసినట్లు చెప్పుతున్నారు. ఇక ది బిజెనెస్ మ్యాన్ విషయానికి వస్తే...ఈ చిత్రం నేపధ్యం ముంబై మాఫియాలోని ఆయుధాల వ్యాపారం..కొనుగోళ్ళు ..అమ్మకాల చుట్టూ తిరగనుందని తెలుస్తోంది.ముంబైలోనే ఎక్కువ బాగం షూట్ చేయాలని పూరీ భావిస్తున్నారు.గన్స్ నీడ్స్ నో ఎగ్రిమెంట్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా స్టైలిష్ గా సాగే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు.ఇక ఈ చిత్రం ముంబై మాఫియాకి చెందిన కథగా తెరకెక్కుతోంది. 'బిజినెస్‌మ్యాన్'గా టైటిల్‌కు తగిన పాత్ర అది. పోకిరి తర్వాత అంతటి హిట్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాం అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్. ఆర్.ఆర్.మూవీస్ పతాకంపై ఆయన రూపొందించబోయే చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని అందివ్వాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.అలాగే ఈ చిత్రంలో తొలిసారిగా కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.
No comments:
Post a Comment