బాలీవుడ్
తార, అందగత్తె ఐశ్వర్యా రాయ్ బచ్చన్ డెలివరీకి సంబంధించిన వార్తా కథనాల
ప్రసారంపై ప్రసారమాధ్యమాలు స్వయంగా ఆంక్షలు విధించుకున్నాయి........ ఈ విషయాన్ని
ఐశ్వర్య మామ, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్ బ్లాగులో
పేర్కొన్నారు.
ఐశ్వర్య ప్రసవానికి సంబంధించిన వార్తల ప్రసారంపై స్వయంగా మీడియా ఆంక్షలను విధించుకోవడం తన హృదయాన్ని టచ్ చేసిందన్నారు. ఐశ్వర్యకు డెలివరీకి సంబంధించిన వార్తల కవరేజిపై అనుసరించాల్సిన నియమాల్ని, మార్గదర్శకాలను తెలియచేస్తూ.. పది పాయింట్లతో కూడిన నియమావళిని బ్రాడ్‌కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ తాజాగా విడుదల చేసింది.

ఈ నియమావళిలో ఐశ్వర్య డెలివరీ గురించి అధికారికంగా సమాచారం అందిన తర్వాతనే వార్తలను ప్రసారం చేయాలని విధిగా సూచించింది. అలాగే, ఐశ్వర్య డెలివరీపై ముందస్తు ఊహాగాన కథనాలు ఉండరాదని.. బ్రేకింగ్ న్యూస్ తదితర హంగామా ఉండరాదని తెలిపింది.
ఆస్పత్రి వెలుపల లేదా ఆస్పత్రి పరిసరాల్లో బ్రాడ్‌కాస్టింగ్ వాహనాలను (ఓబీ) ఉంచరాదని బ్రాడ్‌కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ సూచించింది. బచ్చన్ కుటుంబం ఆహ్వనం మేరకే ఫోటోలు తీయడానికి వెళ్లాని స్పష్టం చేసింది. ఈ తరహా ఆంక్షల పట్ల అమితాబ్ బచ్చన్ హర్షం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment