Friday, December 23, 2011

అంగాంగ ప్రదర్శనల వల్లే ఈవ్ టీజింగ్‌లు!

ఈవ్‌టీజింగ్ అనగానే మనకు గుర్తు వచ్చేది ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఏదో ఒక కారణంతో......వేధించడం. లేదా అమ్మాని అమ్మాయిలు మానసికంగా వేధించడం. ఈ సంస్కృతి ఇటీవలి కాలంలో దేశంలోని ప్రముఖ నగరాల్లోనే కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లో సైతం చోటు చేసుకుంటున్నట్టు నిత్యం మనం టీవీల్లో, పత్రికల్లో వార్తలను చదువుతున్నాం. అయితే, ఈ ఈవ్‌టీజింగ్‌కు అనేక కారణాలు ఉన్నట్టు మానసిక నిపుణులతో పాటు.. పోలీసులు చెపుతున్నారు.

ప్రాశ్చాత్య సంస్కృతి మోజులో పడిన నేటి యువత.. ముఖ్యంగా యువతులు రకరకాల మోడరన్ డ్రెస్‌లను వేసుకుంటున్నారు. ఇలాంటి డ్రెస్‌ల ద్వారా అంగాంగ ప్రదర్శన చేస్తున్నారు. వీరిని చూసిన యువత.. ఎమోషన్‌కు గురై వివిధ రకాల కామెంట్లు చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.

ఇలాంటి వేధింపులు తగ్గాలంటే మానసిక నిపుణులు కొన్ని రకాల సలహాలు, సూచనలు చేస్తున్నారు. శరీర భాగాలను పూర్తిగా కప్పివుంచే డ్రెస్‌లను హుందాగా ధరించడం వల్ల గణనీయంగా తగ్గించవచ్చన్నారు. ముఖ్యంగా.. శరీరానికి బిగుతుగా, అతుక్కుని ఉండే డ్రెస్‌లు వేయకూడదని, నైటీలు, ష్కర్ట్స్ వేసుకుని రోడ్లపై తిరగరాదని కోరుతున్నారు.

వీటితోపాటు.. ఒంటరిగా లేదా జంటగా వచ్చే ఆడపిల్లలు ధైర్యంగా, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ఇలా చేయడం వల్ల దేశంలో జరుగుతున్న ఈవ్‌టీజింగ్ కేసుల్లో యాభై శాతం మేరకు తగ్గించవచ్చని వారు కోరుతున్నారు.

No comments:

Post a Comment