Tuesday, February 14, 2012

నా క్లాస్‌మేట్‌ను చూసి పడిపోయా: సనా ఖాన్

Sana Khan
సనాఖాన్‌.. ముంబై నుంచి దిగుమతి అయిన నటి. తెలుగు, తమిళ చిత్రాల్లో ఇప్పుడు బిజీ అయిపోయింది. తాజాగా మంచు మనోజ్‌తో 'మిస్టర్‌ నోకియా'లో చేస్తుంది. ఈ సందర్బంగా ఆమె చెప్పిన సంగతులు....

ముందుగా వాలెంటైన్ డే గురించి ఎలా ఫీలవుతున్నారు?
వాలెంటైన్స్‌ అంటే.. ప్రేమ గురించని అందరికీ తెలిసిందే. సమాజంలో అందరికీ ప్రేమ ముఖ్యం. రకరకాల సమయాల్లో రకరకాలుగా ప్రేమిస్తుంటాం. తల్లిదండ్రుల్ని, స్నేహితుల్ని...........................ఆ తర్వాత లవర్‌ను..
మీరెవరినైనా ప్రేమించారా?
ప్రేమ గురించి చెప్పాలంటే కష్టమే. నేను లెవన్త్‌ స్టాండర్డ్‌లో ఉండగా.. మా క్లాస్‌మేట్‌తో అది ప్రేమో, ఎట్రాక్షనో తెలీదు. చాలా ఇష్టపడేదాన్ని. ట్వల్త్ స్టాండెర్డ్‌ తర్వాత నేను చదువు మానేశాను. ఆ తర్వాత అతను కూడా నన్ను కలవలేదు. అలా జరిగిపోయింది.

మీ విద్యాభ్యాసం?
ముంబై నేషనల్స్‌లో ట్వెల్త్‌ స్టాండెర్డ్‌ వరకే చదివాను. ఆ తర్వాత చదువు సాగలేదు.

ఎందుకని మానేశారు?
అప్పటికే పలు యాడ్స్‌లో పాల్గొన్నాను. ఇమామి యాడ్‌లో షారుఖ్‌ ఖాన్‌తో పాల్గొన్నాను. ఆ తర్వాత కొన్ని వీడియో గేమ్‌ యాడ్స్‌లో పాల్గొన్నాను.

సినిమాల్లోకి ఎలా ప్రవేశించారు?
ముంబైకు శింబు ఓసారి వచ్చారు. తను చేయబోయే సినిమాలో కొత్తవారికి ఆడిషన్‌ జరుగుతుంది. ఆ సమయంలో ఓ మేనేజర్‌ ద్వారా కలిశాను. ఎంపికయ్యాను. 'సేలంబాటమ్‌' అనే తమిళ చిత్రంలో చేశాను. సౌత్‌లో ఆఫర్లు వస్తున్నాయి. కత్తి, గగనం చిత్రాల్లో నటించాను. ఇప్పటికే 7 సినిమాల్లో నటించాను.

లాంగ్వేజ్‌ ఎలా మేనేజ్‌ చేస్తున్నారు?
ఏ భాషా చిత్రమైనా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆ భాష తెలిసినవారు ఉంటారు. వారు చెప్పినట్లు చేయగలుగుతున్నాను. ఇది పెద్ద కష్టంకాదు.

నటన ఎక్కడైనా నేర్చుకున్నారా?
నేర్చుకోలేదు... ఎబిసిడీ కూడా తెలీదు. యాడ్‌లో పాల్గొనడం.. ఆ తర్వాత చూసి నేర్చుకోవడమే.

మీ బెస్ట్‌ ఫ్రెండ్‌?
పూనమ్‌ కౌర్‌.

మిస్టర్‌ నోకియాలో మీ పాత్ర ఏమిటి?
ఇన్నోసెంట్‌గా ఉంటాను. కానీ అన్నీ చేస్తాను. చాలా తెలివైన పాత్ర. నాకు ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్‌ ఉంటారు. కాసినోవాలా ఉంటాను. మంచి పవర్‌ఫుల్‌ పాత్ర. సినిమాకు కీలకం అని చెప్పింది.

No comments:

Post a Comment