Thursday, February 2, 2012

రోగులు సంభోగంలో పాల్గొన వచ్చా?

women patient
వివిధ రకాల వ్యాధులతో బాధపడే వారు రతిలో పాల్గొన వచ్చా? అనే ధర్మ సందేహం అనేక మందికి కలుగుతుంటుంది. ఇలా పాల్గొనడం వల్ల రోగికి ఉండే వ్యాధులు భాగస్వామికి సోకుతాయనే అపోహ చాలా మందిలో ఉంది. వాస్తవంగా చెప్పాలంటే సుఖ, అంటు వ్యాధుల విషయంలో............................ ఇది చాలా వరకు నిజమే. కానీ, ఇతర సాధారణ వ్యాధుల విషయంలో దీనికి ఆస్కారమే లేదు. ఏ వ్యాధులు ఉన్నవారు రతిలో పాల్గొనరాదు, ఎటువంటి వ్యాధులు రతి వల్ల భాగస్వాములకు సంక్రమిచవు అనే విషయం చాలా మందికి తెలియవు. దీనిపై సెక్స్ వైద్య నిపుణులను సంప్రదించగా... గనేరియా, సిఫిలిస్, ఎయిడ్స్ వంటి వ్యాధులు రతి వల్ల ఇంకొకరి నుంచీ సంక్రమిస్తాయని చెపుతున్నారు.

ఈ విషయం చాలా మందికి తెల్సిందే. మరి ఏ వ్యాధులున్నవారు పాల్గొనవచ్చు అనేదే ఇప్పుడు తెలుసుకోవల్సింది. మామూలు జ్వరం నుంచి కామెర్లు, క్షయ, గుండె జబ్బులు, మధుమేహం తదితర వ్యాధులున్న వారు రతిలో పాల్గొనకూడదని కొంతమంది భావిస్తుంటారు. మధుమేహం ఉన్న రోగులు రతిలో పాల్గొంటే వారు తేలికగా అలసిపోవడం అన్నది కొంతవరకూ నిజమే.

మధుమేహ గ్రస్తుల వల్ల వ్యాధి భాగస్వామికి సోకుతుందనడం కేవలం అపోహ మాత్రమే. క్షయ వ్యాధిని తీసుకుంటే ఇది అంటు వ్యాధే అయినప్పటికీ రతిలో పాల్గొంటే ఇతరులకు సోకదు. ఇలాంటి అనేక అపోహల వల్ల చాలామంది సంసార జీవితాన్ని నాశనం చేసుకుంటుంటారు. సమస్య ఏదైనా ఆరోగ్యం విషయంలో వైద్యులను సంప్రదిస్తే అపోహలకు ఆస్కారం ఉండదని వారు చెపుతున్నారు.

No comments:

Post a Comment