Wednesday, March 7, 2012

వయస్సుకు.. సెక్స్ స్పందనలకు లింకు లేదు: నిపుణులు

couple
అనేక పురుషులు లేదా మహిళలు వివిధ కారణాలు, బరువు బాధ్యతల వల్ల పెళ్లిళ్లు లేత వయస్సులో చేసుకుంటుంటారు. అయితే, లేత వయస్సులో వివాహం చేసుకోవడం మంచిదేనా........................... అనే సందహం అనేక మందిలో ఉంటుంది. ఇదే అంశంపై సెక్స్ నిపుణులను అభిప్రాయాలను తెలుసుకుందాం. సాధారణంగా పెళ్ళికి వయస్సుతో ప్రమేయం లేదు. వయస్సు ఎంత మళ్ళినా పెళ్ళి చేసుకోవచ్చు. వయస్సు మళ్ళిన వారిలో సెక్స్‌ ఉండదనుకోవడం పొరబాటేనని అంటున్నారు. 60 లేదా 80 వచ్చినా... సెక్స్‌ విషయంలో మనస్సు యంగ్‌గానే ఉంటుందన్నది వీరి అభిప్రాయం. స్త్రీలకైనా, పురుషూలకైనా ఎంత వయస్సు మళ్ళినా సెక్స్‌ స్పందనలు యంగ్‌ గానే ఉంటాయని చెపుతున్నారు.

అయితే, 60 లేదా 80 తర్వాత ఎవరిలోనైనా సెక్స్‌ స్పందనలు లేవు అంటే అది వయస్సు మీద పడడం కాదు, మనస్సు ముసలిది కావడమే కారణం. వయసు మీద పడింది కనుక సెక్స్‌కి పనికిరానని అనుకుంటే మనస్సు కూడా ముసలిదై కూర్చుంటుంది. సెక్స్‌కి వయస్సుతో సంబంధం లేదు. మనసు శృంగార భావాలతో ఉరకలేస్తే శరీరం కూడా వయస్సు మరచి కుర్రదవుతుందని చెపుతున్నారు.

శ్రుంగారంలో 20 యేళ్ళ కుర్రోడైనా ఉద్వేగం లేకపోతే ముసలివాడుగా మారుతాడు. ముసలివాడైనా హుషారైన మనస్సు కలిగి ఉంటే కుర్రవానిలాగా ఉంటాడు. కోడెదూడలాగా మనస్సు రంకెలేసి గంతులేస్తుంది. చాలామంది నలభై యాభై సంవత్సరాలు వచ్చేసరికి సెక్స్‌లో డల్‌గా కనిపిస్తుంటారు. వారి జీవితాన్ని యాంత్రికంగా చేసుకోవడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.

దాంపత్య జీవితంలో కూడా కొత్తదనాల్ని నింపుకోలేక పోవడం మరో కారణం. రోజూ తినే కూర అయినా రోజుకొక రుచిగా చేసుకుంటే ఎప్పటికీ మొహం మొత్తదు. సెక్స్‌ విషయంలో కూడా ఆ నేర్పు ఉండాలి. ఆ ఊపు ఉండాలి. జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం అనేది మనిషి చేతిలోనే ఉంది. దిగులుతో, బాధతో కుమిలిపోయే మనిషికి ఇరవైలోనే అరవై వచ్చేస్తుంది. అలాగాకుండా కష్టాల్ని తేలికగా, సమస్యలను చాకచక్యంగా పరిష్కరించే వ్యక్తిలో అరవై వచ్చినా ఇరవై లాగానే ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.

ముఖ్యంగా.. మగవాళ్ళలో 70 వచ్చినా సెక్స్‌ సామర్థ్యం మామూలుగానే ఉంటుంది. ఆరోగ్యకరమైన వ్యక్తిలో ఆహ్లాదకరమైన మనస్సు ఉంటుంది. శృంగార భావాలు చక్కగానే ఉంటాయి. సెక్స్‌ స్పందనలు మనస్సుకు కిక్కునిస్తూనే ఉంటాయి. ఏ వయస్సుకి తీసిపోని విధంగా రతిలో పరాకాష్ట మంచి సుఖప్రాప్తిని కలిగిస్తుంది. కావలసినదల్లా ఆ వ్యక్తిలో ఉండవలసింది మంచి ఆరోగ్యం.

వ్యాయామం చేసే వ్యక్తిలో చక్కని ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మంచి అలవాట్లు సెక్స్‌‌ని నిత్యనూతనంగా ఉంచుతాయి. స్త్రీలలో కూడా పురుషూలలాగానే ఎంత వయస్సు మీద పడినా సెక్స్‌ సక్సెస్‌ఫుల్‌గానే ఉంటుంది. మనస్సును సెక్సీగానే ఉంచుతుంది. వయస్సు మళ్ళిన వారిలో రోజుకు పలు మార్లు రతిలో పాల్గొనే సామర్థ్యం లేకపోవచ్చు గానీ సెక్స్‌లో ఆనందించే మనస్సు మాత్రం ఉంటుంది. మూడు నాలుగు రోజులకి ఒక్క సారే రతిలో పాల్గొన్నా సెక్స్‌లో కలిగే మధురానుభూతి మనస్సును పులకింపజేస్తుంది. ఆ మధురానుభూతి రోజూ సెక్స్‌లో పాల్గొనలేక పోతున్నామనే అసంతృప్తి దూరం చేస్తుంది.

No comments:

Post a Comment