Tuesday, March 27, 2012

బికినీ అందాలతో ‘బద్రి’ హీరోయిన్

'బద్రి’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన భామ అమీషా పటేల్. అయితే ఆమె నటించిన ‘నాని’ చిత్రం పరాజయం...................... పాలవ్వడంతో మళ్లీ తెలుగులో కనిపించలేదు. కొన్ని రోజుల క్రితం బాలయ్య సరసన పరమవీర చక్రలో నటించినా ఆ సినిమా ప్లాపయింది. బాలీవుడ్‌లో కూడా అమీషా పరిస్థితి ఏమంత బాగోలేదు. కథానాయికగా రేసులో వెనకబడ్డ ఈ భామ నిర్మాతగా అవతారమెత్తి అక్కడా పరాజయాన్ని చవిచూసింది.
సుదీర్ఘ కాలం తర్వాత భారీ చిత్రం ‘రేస్ 2’లో నటిస్తోంది అమీషా. పదేళ్ల క్రితం వచ్చిన సంచలన చిత్రం ‘రేస్’కు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో తన సత్తాను చూపించి తిరిగి బాలీవుడ్‌లో పాగా వేయాలని చూస్తోంది ఈ భామ. ఇందుకో అందాల ప్రదర్శననే ఎంచుకుంది. ఈ చిత్రంలో ఈ ముద్దుగుమ్మతో పాటు దీపికా పదుకునే, జాక్వెలైన్ ఫెర్నాండేజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ ఇద్దరిని మించి సినిమాలో ఎక్కువ గుర్తింపు పొందాలనే తాపత్రయంతో ఉన్న అమీషా ఈ చిత్రంలో టూపీస్ బికినీలో అందాల కనువిందు చేయాలని నిర్ణయించుకుంది.
ఈ విషయమై అమీషా స్పందిస్తూ ‘కథానుగుణంగానే ఈ చిత్రంలో బికినీ ధరించాల్సివచ్చింది. అశ్లీలతకు తావులేకుండా అందాల్ని ప్రదర్శించడంలో తప్పులేదని నా అభిప్రాయం. గతంలో ‘తోడా ప్యార్ తోడా మ్యాజిక్’ చిత్రంలో కూడా ఈ తరహా బికినీ ధరించాను’ అని చెప్పింది. చిత్ర దర్శక ద్వయం అబ్బాస్-మస్తాన్‌లు బికినీ సీన్ గురించి చెప్పిన వెంటనే ఈ సుందరి తన ఐపాడ్ ఫోన్‌లో వున్న బికినీ ఫోటో షూట్‌ను వారికి చూపించి అబ్బురపరిచిందట.

No comments:

Post a Comment