Monday, June 4, 2012

థర్డ్ జండర్ అంటే ఏంటి.. వీరిలో ఎన్ని రకాలు?

సమాజంలో ఆడా మగా కాని వారిని థర్డ్ జండర్ అంటారు. అంటే శారీరకంగా, మానసికంగా, సెక్సుపరంగా పూర్తిగా స్త్రీ లేదా పురుషులు కానివారినే 'తృతీయ ప్రకృతి' (థర్డ్ జండర్) అంటారు. అయితే,...............వీరిలో చాలా రకాలు ఉన్నట్టు సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ థర్డ్ జండర్‌లో ఐదు రకాలుగా ఉంటాయని వైద్యులు చెపుతున్నారు.

వీటిలో మొదటిది ఇంటర్‌సెక్స్. జన్యుపరంగా, హార్మోనుల పరంగా, లైంగిక భాగాల తయారీలో తప్పులున్నప్పుడు, పుట్టుకతోనే కొందరు పూర్తి మగ లేదా పూర్తి ఆడ కాకుండా తయారవుతారు. వీరిలో కొంతమందిలో ఆపరేషనుల ద్వారా, మందుల ద్వారా సరిచేయవచ్చు.

రెండోది హోమోసెక్స్. వీరు స్వాభావికంగా, మానసికంగా, శరీరపరంగా పూర్తిగా మగలా లేదా ఆడలా ఉంటారు. వీరిక లైంగిక ఆకర్షణ మాత్రం స్వజాతిపైనే ఉంటుంది. వీరిని గే లేదా లెస్బియన్స్ అంటారు.

మూడో రకం బై సెక్సువల్. వీరు శారీరకంగా, మానసికంగా, సమాజపరంగా మామూలుగానే ఉంటారు. వీరి కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది. వీరిలో మగవారిలో మగవారిపైనా, ఆడవారిపైనా, లేదా ఇద్దరిపైనా సెక్సు కోరికలు ఉంటాయి. సెక్సు చేయగలరు. అదేవిధంగా స్త్రీలలో స్త్రీలపైన, పురుషులపైనా ఇద్దరిపైనా సెక్సు కోరికలు ఉంటాయి. సెక్సుకు స్పందించగలరు.

నాలుగో రకం ట్రాన్స్‌జెండర్స్ లేదా ట్రాన్స్ సెక్సువల్స్. వీళ్ళు చూడటానికి మగవారు మగవారిలాగాను, ఆడవారు ఆడవారిలాగానూ ఉంటారు. తల్లిదండ్రులు అట్లానే పెంచుతారు. వీరిలో మగవారు తమను ఆడవారిలాగా ఊహించుకుంటారు. మగవారిలా ఉండటాన్ని అసహ్యించుకుంటారు. దేవుడు తనను ఒక స్త్రీని మగవాడిలా పుట్టించాడు అనుకుంటారు. తమను మగ శరీరంలో బంధించబడ్డ ఆడవారిగా అనుకుంటారు.

అదేవిధంగా స్త్రీలు తమను పురుషునిగా ఊహించుకుంటూ, పురుషునిగా ప్రవర్తిస్తూ, మరో మామూలు స్త్రీని పెళ్ళి చేసుకోవటానికి సిద్ధపడతారు. వీరిని ట్రాన్స్‌‌జెండర్స్ అంటారు. ఇట్లాంటివాళ్ళు కొందరు లింగ మార్పిడి (సెక్స్ మార్పిడి) ఆపరేషను చేయించుకుని తమకు కావలసిన విధంగా మారిపోతారు. వీరిని ట్రాన్స్ సెక్సువల్ అంటారు.

చివరి రకం హిజ్రాలు (కొజ్జాలు). పూర్వం రాజులకు, నవాబులకు చాలామంది భార్యలు ఉండేవారు. వారికి రాణివాసాలు, జనానాలు ఉండేవి. వాటికి కాపలాగా మగవారిని నియమించే వారు కాదు. మగ బానిసలకు వృషణాలు, లింగాలు కత్తిరించి, వారిని బలంగాను, నపుంసకులుగాను తయారుచేసి జనానాకు కాపలాదారుగా, సేవకులుగా నియమించేవారు. వీరినే కొజ్జాలనేవారు.

No comments:

Post a Comment