అప్పటి వరకు వివిధ రతి భంగిమలతో ఆనందించిన జంటలకు ప్రెగ్నెన్స
వచ్చేసిందంటే, తమ ఆనందాలకు బ్రేక్ పడినట్లే భావిస్తారు. ఎప్పటినుండి రతిని
నిలపాలి? రతి చేస్తే మహిళ......................
ఆరోగ్యం, లేదా బిడ్డ ఆరోగ్యం ఎలా వుంటుంది? అని
భావిస్తారు. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళ సెక్స్ చేస్తే గర్భంలో వున్న బిడ్డకు
ప్రమాదకరమా అనేది గర్భవతులను, వారి భాగస్వాములను వేధిస్తున్న సమస్య. లోపల
వున్న బేబీకి ఇబ్బంది కలిగిస్తున్నామా, నిద్రిస్తున్న బేబీని లేపటమవుతుందా?
పేరెంట్స్ సెక్స్ చేస్తున్నట్లు లోపలి బేబీకి తెలుస్తుందా? ఇటువంటి
అనుమానాలు కూడా వుంటాయి.
మహిళ గర్భం లో వున్న పిండం చుట్టూ
ఎమినియోటిక్ ద్రవాలు వుండి, గర్భాశయంలో బిడ్డ ఎంతో సుక్షితంగా వుండి బయటి
ప్రపంచంతో ఏ మాత్రం సంబంధం లేకుండా వుంటుంది. అయితే, మహిళ తాను గర్భం మోసే 9
నెలలలోను, మొదటి మూడు నెలల కాలంలో అలసట, మార్నింగ్ సిక్ నెస్, నిద్ర
అధికమవటం మొదలైన కారణాలుగా సెక్స్ అంటే చివరి ప్రాధాన్యత చూపుతుంది.
దీనికితోడు ఆమె స్తనాలు కామోద్రేకం కలిగితే నొప్పిపెడుతూంటాయి. ఒక వేళ
పురుషుడు సెక్స్ తలపెట్టినా ఆమె తిరస్కరిస్తుంది.
రెండో త్రైమాసికంలో మహిళ కడుపులో బిడ్డకు కొంత అలవాటుపడి కామ వాంఛ కలిగి వుంటుంది. ఈ రెండో త్రైమాసికంలో జీవిత భాగస్వాములు ఆనందకర రతిని సౌకర్యంగా చేసుకోవచ్చు. దీనినే సెకండ్ హనీమూన్ గా కూడా చెపుతారు. ఈ సమయంలో మహిళకు సెక్స్ కోర్కెలు అధికం అవుతాయి. బేబీకి ఎటువంటి అపాయం కూడా వుండదు. చాలామంది పురుషులు తమ భాగస్వామి శారీరక లావణ్యం చూసి రతికి సిద్ధపడతారు.
మూడవ త్రైమాసికంలో కూడా సెక్స్ సాధ్యమే కానీ కడుపులో బిడ్డ పెద్దదవటంతో అసౌకర్యంగా వుంటుంది. సాధారణంగా రతి చురుకుదనం తగ్గిపోతుంది. ఇక మహిళ దృష్టి అంతా పుట్టబోయే బిడ్డపైనే వుంటుంది. బిడ్డ కదలికలు కూడా లోపల అధికంగా వుండటంతో అలసిపోతుంది. ఇక ప్రెగ్నన్సీ చివరి దశలో 50 శాతం జంటలు తమ సెక్స్ కార్యాన్ని ఆపేస్తారు.

No comments:
Post a Comment