Tuesday, October 15, 2013

'24 క్రాప్ట్స్ '

సినిమా ఇది ప్రేక్షకులకు పెద్ద వినోదాల విందు. '24 క్రాప్ట్స్ ' సమన్వయం తో తయారవుతోంది. మరి సినిమా రుచి ప్రేక్షకులకు చూపించేది మాత్రం ప్రమోషన్సే. మొదటివారం కలెక్షన్స్ ను ప్రభావితం చేయడంలో
ప్రమోషన్స్ కీలక పాత్ర పోషిస్తాయి. మరి ఈ ప్రమోషన్స్ కి గ్లామర్ చాలా అవసరం. ఆ అవసరం ఏ ఇండస్ట్రీ లోనూ పూర్తిగా తీరడం లేదు. చాలా పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోయిన్స్ కూడా ప్రమోషన్స్ లో పాల్గొనడానికి ఇంట్రస్ట్ చూపించడం లేదు. షూటింగ్ గుమ్మడి కాయం కొట్టడంతోనే తమ పని అయిపోయిందని ఫీలవుతున్నారు. ఏదైనా.. ఒక సినిమాని ప్రమోట్ చేసుకోవాలంటే గ్లామర్ తప్పనిసరి. ఆ హీరోయిన్స్ ని తీసుకొచ్చి తమ సినిమా గురించి నాలుగు ముక్కలు చెప్పిచడం నిర్మాతలకు తలనొప్పి వ్యవహారంలా మారింది.. ప్రమోషన్స్ విషయంలో హీరోలు పర్వాలేదనిపించినా.. హీరోయిన్స్ మీద కంప్లైంట్ చాలా వున్నాయి టాలీవుడ్ లో..షాప్స్ ఒపెనింగ్స్ పై ఉన్న ఇంట్రెస్ట్ తమకు కెరియర్ నిస్తున్న సినిమాపై ఎందుకు ఉండదనేది ఇండస్ట్రీ పెద్దల ప్రశ్న..? అయితే ఈ ప్రశ్నకు సమాధానం తమిళ నిర్మాతలు చెప్పారు? ప్రమోషన్స్ కి సహాకరించిన వారికే పూర్తి రెమ్యూనరేషన్ ఇస్తామనే నిర్ణయం తీసుకున్నారు. మొత్తం రెమ్యూనరేషన్ లో 75 శాతం షూటింగ్ కంప్లీట్ అవగానే ఇవ్వాలని మిగిలిన 25 శాతం ప్రమోషన్స్ కు సహకరించిన తర్వాతే ఇవ్వాలని తెల్చేశారు. ఈ నిర్ణయం గట్టిగా అమలయితే నిర్మాతల కష్టాలు కొంత వరకూ తీరతాయి.. మరి అదే నిర్ణయం తెలుగు నిర్మాతల మండలి కూడా తీసుకోవాలని కోరుతున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు.. 

No comments:

Post a Comment