అలంకరణ-ఆభరణాలు అనేది ప్రాచీన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. అన్ని
దేశాల్లోనూ, అన్ని జాత్తుల్లోనూ, అన్ని కాలాల్లోనూ అలంకరణ మీద మోజు
కనిపిస్తూనే ఉన్నారు. చీరకట్టు ఎరగని భారతీయులుగానీ, చీరకట్టు అంటే
ముచ్చటపడని విదేశీయులుగానీ లేరనడంలో సందేహం లేదు. ప్రతినిత్యం ఏదో ఓ
కొత్తదనం కోసం పాకులాడుటం మానవనైజం. అవి కట్టు, బొట్టు విషయంలోకావచ్చు,
వేరే ఏ ఇతర విషయాలలోనైనా కావచ్చు. చూస్తున్న ప్రతిసారి ఏదో కొత్త సొంపు,
సోయగం, హుందాతనం కలిగి, మరుగునపడడం కాదు. కనీసం తెరమరుగున పడటం అంటే కూడా
ఎరగని సిసలైన సాంప్రదాయక సౌందర్యం చీరదే.
చీరకట్టు భారతీయులకే పరిమితం. ఆరుగజాల చీరను వంటికి చుట్టుకోవడంతో
సరిపెట్టుకోక దాన్ని అందంగా, ఆకర్షణీయంగా ఎలా కట్టుకోవాలో భారతీయ మహిళకు
తెలిసినట్లుగా మరెవరికీ తెలియదేమో...! బెంగాలీ, మరాఠీ, తమిళనాడు, ఆంధ్రా..
ఇలా ప్రాంతాలు ఏవయినా, అక్కడి చీరకట్టు వేరయినా అందులోనూ ఓ అందం ఉంటుంది.
అందుకే విదేశీయులు సైతం మన భారతీయ మహిళల చీరకట్టు పట్ల మోజుపడుతున్నారు.
అందుకే ఇటీవలి కాలంలో చీరకట్టు సైతం కొత్త పుంతలు పోతోంది. ఫ్యాషన్ షోలలో
కూడా చోటు దక్కించుకుంటోంది. ఈ అందాల భామల చీర కట్టు చీరకే కాదు, వారికి
కూడా కొత్త అందాలను తెచ్చిపెడుతోంది కదూ..!
ఈ మద్య కాలంలో చాలా మంది హాలీవుడ్ సెలబ్రెటీలు కూడా అందంగా చీరలు కట్లుకొని
ఈవెంట్స్ మరియు రెడ్ కార్పెట్ మీద దర్శనమివ్వడాన్ని మనం గమనించే ఉంటాం.
సెలబ్రెటీల్లో ఒకరైన ఎల్జిబెత్ హర్లే ఒక ఇండియన్ బిజినెస్ మ్యాన్ అరున్
నాయర్ యొక్క భార్య, 2007లో మ్యారేజ్ అయినప్పుడు, సాంప్రదాయ పద్దతిలో మన
ఇండియన్ స్టైల్లో చీరకట్టుకుంది.
ఆమెలాగే, మరికొంత మంది మన ఇండియా సందర్శనార్థం వర్చే వారు, వారు కూడా మన
ఇండియన్ సాంప్రదాయం అయినా కట్టు, బొట్టులో కనబడాలని అనుకుంటారు. అటువంటి
వారిలో చాలా మంది ప్రముఖ సెలబ్రెటీలు అందంగా చీరకట్టుకొని మరి అద్భుతమైన
కళను ప్రదర్శించారు. అది వారు అలంకరించుకొనే విదానం మరియు ఫర్ ఫెక్ట్ మేకప్
మరియు స్టైల్ మరియు అలంకరణ వస్తువులను అలంకరించుకోవడం చూస్తే చాలా అందంగా
కనబడుతారు. అలా మన ఇండియన్ సాంప్రధాయ కట్టు, బొట్టు మీద ఎక్కువ మక్కువ
పెంచుకొని, ఇష్టంగా చీర కట్టుకొన్న కొంత మంది హాలీవుడ్ సెలబ్రెటీలను
అందరినీ ఒక చోట చేర్చింది మా బోల్డ్ స్కై. చీరల్లో వారి చాలా అందంగా
కనబడుతున్నారు..మరి సెలబ్రెటీలను ఈక్రింది స్లైడ్ ద్వారా చూసేయండి...

No comments:
Post a Comment