ముంబయి : మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ అందాల నటి 'ప్రియాంక చోప్రా' కు కోపం వచ్చింది. తన గురించి గాని..తన ఫ్యామిలీ జోలికి వస్తే తోలు తీస్తానంటూ
ఆసీమ్ మర్చంట్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేగాక అతడికి లీగల్ నోటీసును సైతం పంపించింది. ఎందుకంత ఆగ్రహం కలిగించింది..లీగల్ నోటీసులను పంపించాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పాడ్డాయి ?
ప్రియాంక చోప్రా..కొత్తగా సినిమాల్లోకి వచ్చినప్పుడు 'ఆసీమ్ మర్చంట్' కుర్రాడితో ప్రేమలో పడింది. తరువాత సీన్ మారింది. ప్రియాంక పాత్రం స్టార్ అయిపోగా ఆసీమ్ మాత్రం పెద్దగా ఎదగలేకపోయాడు. తాజాగా ఆసీమ్ ఓ సినిమాను తీస్తున్నట్లు ప్రకటించాడు. ఫ్యాషన్ నేపథ్యంలో సినిమా తీస్తున్నట్లు, గ్లామర్ వెనుకున్న మలుపుల నేపథ్యంలో సినిమా ఉంటుందని వెల్లడించాడు. ఇది పక్కాగా ప్రియాంక జీవిత నేపథ్యంతో కూడుకున్న కథ అని ప్రచారం జరిగింది.
ప్రియాంక ఆగ్రహం...
దీనికి ప్రియాంక సీరియస్ అయ్యింది. పబ్లిసిటీ ఆపేయాలని హుకుం జారీ చేసి లీగల్ నోటీసు పంపించింది.
తన గురించి గాని..తన ఫ్యామిలీ గురించి గాని ఎక్కడైనా కనపడితే తోలు తీస్తానంటూ వార్నింగిచ్చింది. అయితే అసీమ్ మర్చంట్ మాత్రం టేకిట్ ఈజీ అంటున్నాడు. తాను తీసేది ప్రియాంక మేనేజర్‌గా చేసిన ప్రకాష్ జాజు స్టోరీ అని తెలివిగా చెబుతున్నాడు. అందులో సందర్భాన్ని బట్టి ప్రియాంక పాత్ర వచ్చిపోతుందే తప్ప.. ఆమెను కించపర్చే విధంగా ఎక్కడా ఉండదని స్పష్టం చేస్తున్నాడు. సినిమా సంగతులు బాగా తెలిసిన ప్రియాంక మాత్రం అసీమ్‌ను నమ్మే పరిస్థితి లేదని తెగేసి చెబుతోంది.
ఖుషీగా ఉన్న ఆసీమ్ మర్చంట్...
సినిమా మొదలు కాకుండానే మంచి పబ్లిసిటీ సంపాదించిన అసీమ్.. ఇక తన సినిమాకు బడ్జెట్ ప్రాబ్లెమ్ లేనట్లేనని ఖుషీ అయిపోతున్నాడు. చిక్కుముడులు ఎంత పెరిగితే అంత మంచిదని లోలోపల ఆనందపడుతున్నాడు. అందుకే సినిమా ఆపేది లేదని ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. ప్రియాంక మాత్రం తన ఇమేజ్‌కు ఎక్కడ డామేజ్ అవుతుందోననే బెంగతో తల్లడిల్లిపోతోంది.

No comments:
Post a Comment