Thursday, July 3, 2014

విద్యాబాలన్ బ్రైట్ నియాన్ కలర్ డ్రెస్ లో అమేజింగ్ లుక్

గత కొన్ని రోజుల నుండి విద్యాబాలన్ బిజీబిజీగా కనబడుతున్నారు. ముఖ్యంగా తను నటించిన చిత్రం ‘బాబీ జాసూస్'మూవీ ప్రమోషన్ లో భాగంగా ఈవెంట్స్ తో బిజీగా గడుపుతున్నారు.
రీసెంట్ గా విద్యాబాలన్ ‘బాబీ జాసూస్' మూవీ ప్రమోషన్ కు వాసవి షా అనార్కలి డ్రెస్సులో టెలివిజన్ షోలో పాల్గొన్నారు. ఈ టెలివిజన్ షోకు బ్రైట్ సమ్మరీ లుక్ తో చాలా అందంగా కనబడింది. ఈ డ్రెస్సులో ప్రేక్షకులను కూడా బాగా ఆకర్షింపబడింది. ష్యాషన్ ను అనుసరించడంలో బాలీవుడ్ బ్యూటీస్ ఎప్పుడు ముందంజలో ఉంటారు. అటువంటి వారిలో విద్యా బాలన్ ఒకరు. విద్యావాలన్ తన మూవీ ప్రమోషన్ కి ధరించిన ఈ నియాన్ బ్రైట్ కలర్ డ్రెస్ లో విద్యాబాలన్ అమేజింగ్ లుక్!స్ట్రెయింట్ అనార్కలి దానికి మీదకు పలాజో ప్యాంట్ డిఫరెంట్ గా అనిపించింది. ఇటువంటి ఫ్యాషనబుల్ దుస్తులు విద్యాబాలన్ కే సరిసాటి అనేవిధంగా ఉన్నది. ఈ నియాన్ బ్రైట్ కలర్ అనార్కలీ డ్రెస్ ఈవెనింగ్ పార్టికీ గ్రేట్ లుక్ ను అందించింది. విద్యాబాలన్ ధరించిన ఈ నియాన్ బ్రైట్ కలర్ సూట్ హైలైటింగ్ గా కనిపించింది. దగ్గరగా చూస్తే 5కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేసిన ఈ డ్రెస్స్ మూవీ ప్రమోషన్ లో అద్భుంగా అనిపించింది. వాసవి షా అనార్కలి డ్రెస్ మీద చాలా సన్నటి ఒక లైన్ బార్డర్ చాలా సింపుల్ గా కనబడుతున్నది ఫారెస్ట్ గ్రీన్ ప్లాజో ప్రింటెడ్ ప్యాంట్స్, టాప్ కు ఏమాత్రం సూట్ కాకపోయినా, చాలా గ్రేట్ గా కనబడుతన్నది. డ్రెస్సుమీదకు వేసుకొన్న దుప్పట పూర్తిగా డిఫరెంట్ గా ఉంది. డ్రెస్స్ టాప్ లో ఉన్నటువంటి రెడ్ , ఆరెంజ్ , గ్రీన్ ఏకలర్ కూడా మిక్స్ లేకుండా దుప్పటాను డిజైన్ చేశారు. అలాగే ఈ దుప్పట మీద హెవీ త్రెడ్ వర్క్ వైట్ దుప్పట చాలా ఆకర్షణీయంగా ఉంది . అలాగే ఈ డ్రెస్సులో విద్యాబాలన్ చాలా నేచురల్ లుక్ తో ఉన్నారు . ఈ డ్రెస్సులో వాసవి షా అనార్కలి చూడటానికి స్టైలిష్ గా మరియు డిఫరెంట్ గా ఉన్నది . తన బుగ్గల మీద రోజ్ కలర్ ఫౌండేషన్ మెరస్తూ మరింత అందంగా కనిపించింది మరియు ఆమె డ్రెస్స్ మీద దుప్పటకు మ్యాచ్ అయ్యే విధంగా పింక్ షేడ్ లిప్స్టిక్ ఫర్ ఫెక్ట్ గా అనిపించింది అలాగే ఎప్పటి లాగే ఆమె హెయిర్ స్టైల్ కూడా సాప్ట్ గా కర్లీంగ్ తో పూర్తిగా ఇంప్రెస్ చేసింది. మొత్తానికి విద్యాబాలన్ సినిమా‘బాబీ జసూస్' మూవీ ప్రమోషన్ లో ఇండియన్ లుక్ తో అందరినీ అద్భుతంగా ఆకర్షించింది. ఆమె అందం ముందు ఆమె ధరించినే ఆభరణాలు వెలవెలబోయాయి
.


No comments:

Post a Comment