Sunday, January 9, 2011

అదిరె అదిరె... గొర్రె రేటు అదిరె

'మరీ అంతొద్దు... మామూలుగా గొర్రె రేటు ఎంతుంటుంది? దానికే ఏకంగా పాట కట్టేయాలా!' అన్నట్టు చూస్తున్నారే. కానీ అసలు విషయం తెలిస్తే...మీరూ డంగైపోతారండీ. మోరిసన్‌ అనే రైతు దగ్గర ఓ గొర్రె వుంది. దాని వయసు 8 నెలలు. బాగా బలిష్టంగా వుంటుందిలెండి. ఫొటో చూస్తుంటేనే తెలుస్తుందిగా. దాన్ని ఇటీవల 231,000 పౌండ్లకు అమ్మేరు. 'అమ్మో అంత ధరా' అనుకుంటున్నారు కదూ. అందుకే కదా.....

ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన గొర్రెగా పేరొచ్చేసింది దీనికి. మరో తమాషా ఏమంటే... ఆరేళ్ల కిందట ఒక గొర్రె 128,000 పౌండ్లకు అమ్ముడుపోయింది. ఇది కూడా బ్రిటన్‌లోనే జరిగింది. అది ఇటీవలే చనిపోయిందనుకోండి. అయితే తన జీవితకాలంలో అది ఒక మిలియన్‌కు పైగా ఖరీదుచేసే గొర్రెలకు తండ్రయింది. సర్సరి అసలు పాయింట్‌నుంచి పక్కకెళుతున్నాం కదూ. ఒక్క ముక్క చెప్పి ఈ గొర్రె పురాణం ముగించేస్తాం. కొత్త ఆసామి మాత్రం అంత డబ్బు పోసి ఆ గొర్రెను ఎందుకు కొంటాడు! దానికి పుట్టిన పిల్లలను భారీ మొత్తానికి అమ్మి సొమ్ము చేసుకోడానికే.

No comments:

Post a Comment