పుస్తకాన్ని దూరంగా పెట్టుకొని చూసి చెప్పండి. చూడ్డానికి గొర్రెలాగా వుందికదూ. మరి అంతంత ఊలు వంటినిండా వుంటే అలాకాక మరోలా ఎలా అనుకుంటాంలెండి. కానీ ఇది మేషం కాదు! వరాహం అంటే కూసింత నమ్మబుద్ధికాదు. కానీ... పుస్తకాన్ని దగ్గరగా పెట్టుకొని చూడండి. ముఖ్యంగా మొహం చూడండి. ముక్కు, చెవులు చూసి చెప్పండి. ఆ... ఇది వరాహమే. మరి ఊలు ఎలా వచ్చింది? అనుకొంటున్నారా! అదేనండీ సైన్స్ మహిమ. ఈ రెండు జంతువుల క్రాస్ బ్రీడ్ మన ఎదురుగా వున్న జంతువు. అందుకే పందికి ఊలు కోటు తొడిగినట్టున్న జంతువు పుట్టుకొచ్చింది. ఆస్ట్రియా, హంగరీలో ఈ బ్రీడ్‌ను రూపొందించారు.....
ఆ రెండు దేశాల్లో చలికాలం బాగా ఇబ్బందిగా వుంటుంది. అదే ఊలు వుంటే హాయిగా వుంటుంది కదా వాటికి. ఇప్పుడదే జరుగుతోంది. పైగా వేసవి కాలంలో భానుడి తీవ్రతకు చర్మం కమిలిపోకుండా కాపాడుతుంది. అలా రెండు రకాల ప్రయోజనాలున్నాయి. అసలు విషయం ఏమంటే... మామూలు పందికంటే ఈ ఊలు వరాహం ధర ఐదు రెట్లు ఎక్కువ. అదంతా ఎందుకు అసలు రేటు చెప్పండి అంటారా! ఆ... ఎంతా! సింపుల్‌గా 1, 000 పౌండ్లే. వీటిని ఈ మధ్యే బ్రిటన్‌లోని ఓ జ్యూకి తీసుకొచ్చారు. ఇంక చెప్పేదేముంది? ఎవరి నోట విన్నా ఊలు వరాహం గురించిన మాటలే వినిపిస్తున్నాయట.
No comments:
Post a Comment