Monday, January 10, 2011

బుల్లి చేప

 
మీరు ఎప్పుడైనా 0.33 అంగుళాల చేపను చూశారా! లేదుకదూ. ఇదిగో మీ కళ్ల ముందు కనిపిస్తోందదే. ఇది ప్రపంచంలోకెల్లా చిన్న చేపగా గుర్తింపు పొందింది. అయితే దీన్ని శాస్త్రవేత్తలు పాతిక సంవత్సరాలు ఆలస్యంగా కనుగొన్నారు. వీటికి నోటిలో పళ్లుగానీ, శరీరం మీద పొలుసులుగానీ కనీసం రంగు కూడా వుండదు....

అంతేకాదు. ఇవి చాలా తేలికగా వుంటాయి. అంటే దాదాపు అరకిలో బరువుకే ఐదులక్షల దాకా చేపలు తూగుతాయి. ఇంతకీ దీని పేరేంటో తెల్సా! స్టౌట్‌ ఇన్‌ఫాంట్‌ ఫిష్‌. వీటిలో అతి పెద్ద ఆడ చేపలు అంగుళంలో మూడోవంతు వుండగా, మగచేపలు మాత్రం అంగుళంలో నాలుగో వంతు వుంటాయి. వీటి శీరంలాగే జీవితకాలం కూడా తక్కువే. ఇవి రెండు నెలలు మాత్రమే బతుకుతాయి. అసలు 1979లోనే ఆస్ట్రేలియా తీరంలోని గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌ ప్రాంతంలో ఈ చేపలు కనిపించినప్పటికీ దాదాపు రెండు దశాబ్దాల వరకు వాటి గురించి పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇది వెన్నెముకగల ప్రాణుల్లో అతి చిన్న ప్రాణి అని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. అయితే మనకు ఒక అనుమానం వస్తుంది. ఇంత చిన్న చేప సముద్రంలో ఎలా బతుకుతోంది? అని. ఆ విషయాన్నే కనిపెట్టాల్సి వుంది.

No comments:

Post a Comment