Wednesday, January 12, 2011

ఇంకెన్నాళ్ళు తెలంగాణా బలిదానాలు

 
 ఇంకెన్నాళ్ళు ఈ తెలంగాణా కోసం ఎదురుచూపులంటూ దర్శక నిర్మాత రఫీ అంటున్నాడు. ఇటీవలే మిస్టర్‌ రాహూల్‌ పర్‌ఫెక్ట్‌ అనే చిత్రాన్ని ఆయన నిర్మించారు. ప్రస్తుతం నిర్మించనున్న చిత్రానికి 'ఇంకెన్నాళ్ళు తెలంగాణా బలిదానాలు' అనే పేరు నిర్ణయించారు. ఈ చిత్ర విషయాలను తెలియజేస్తూ...'విద్యార్థులే ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లేవారు. బలిదానాలకూ విద్యార్థులే గురవుతున్నారు. రాజకీయ నాయకులెవ్వరూ చనిపోలేదు. సమాజంలో చెడు పెరిగిపోయింది. మాకు అవినీతి లేని తెలంగాణా కావాలి.

స్వచ్ఛమైన తెలంగాణాను సినిమా ద్వారా చెప్పదలచాం. శ్రీకృష్ణ కమిషన్‌ వేయగానే తెలంగాణా వస్తుందనే అనుకున్నాం. అంతకుముందే రిజిష్టర్‌ అయిన టైటిల్‌ను మళ్ళీ ముందుకు తెచ్చాం. ఓ నలభైరోజులపాటు తెలంగాణాలోని కళాకారులతో సినిమాను నిర్మించదలిచాం. జెఎసీ నాయకులంతా సహకరిస్తున్నారు. తెలంగాణా వాడిగా గర్విస్తున్నా. ముందుగా పాటలను విడుదలచేసి మార్చిలో ప్రారంభిస్తా'మని తెలిపారు. జెఎసీ నాయకులు పిడమర్తి రవి, డి. రాజారామ్‌యాదవ్‌, గాలారి కిషోర్‌, ప్రవీణ్‌రెడ్డి కూడా మాట్లాడారు.

No comments:

Post a Comment