Friday, January 28, 2011

రవికుమార్ దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్‌ చిత్రం

నందమూరి కళ్యాణ్‌రామ్‌ తాజా చిత్రానికి రంగం సిద్ధమవుతోంది. యజ్ఞం ఫేమ్‌ రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో ఇది తయారుకాబోతుంది. అతనొక్కడే తర్వాత అంతటి హిట్‌ కోసం చూస్తున్న కళ్యాణ్‌రామ్‌కు రవి కుమార్‌చౌదరి చెప్పిన కథ నచ్చడంతో గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం.

ప్రస్తుతం కథా చర్చలు చివరి దశలో ఉన్నాయి. ఒక సామాజిక అంశాన్ని టచ్‌ చేసే కథతో రూపొందబోతోంది. యజ్ఞంలో ఫ్యాక్షనిజానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన రవికుమార్‌ చౌదరి ఈ చిత్రంలో మరో అంశాన్ని తీసుకుని వివరణ ఇవ్వనున్నట్లు తెలిసింది.

ఇందులో ప్రముఖ హీరోయిన్‌ నటించనుంది. ఈ చిత్ర కథపై పూర్తి విశ్వాసంతో నందమూరి ఫ్యామిలీ ఉంది. యాక్షన్‌ అంశాలకూ ప్రాధాన్యతగల ఈ సబ్జెక్ట్‌కు కళ్యాణ్‌రామ్‌ కరెక్ట్‌గా సరిపోతాడని భావిస్తున్నారు.

No comments:

Post a Comment