Monday, February 7, 2011

'బి 4 మార్యేజ్'పాటల విడుదల

ఆర్.ఎ. ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోన్న 'బి 4 మ్యారేజ్' చిత్రం పాటలు మధుర ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా మార్కెట్లో విడుదలయ్యాయి. మహానంది రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కనిష్క సంగీత దర్శకుడు.
శనివారం సాయంత్రం ఫిల్మ్‌చాంబర్ ప్రివ్యూ థియేటర్లో జరిగిన కార్యక్రమంలో నిర్మాత, దర్శకుడు సీవీరెడ్డి ఆడియో సీడీలను విడుదల చేసి, తొలి ప్రతిని దర్శకుల సంఘాధ్యక్షుడు వి. సాగర్‌కు అందజేశారు.

ఇది కొత్తవాళ్లతో చేసిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ అని సంభాషణల రచయిత సాయినాథ్ తెలపగా, టైటిల్‌లో కొత్తదనం ఉన్నదని మధుర శ్రీధర్‌రెడ్డి చెప్పారు. తమ సామర్థ్యాన్ని దర్శకుడు బాగా వెలికి తెచ్చారని హీరో విజయ్ అన్నారు.

వైజాగ్‌లో చిత్రీకరణ జరిపారనీ, ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించారనీ కథా రచయిత పి.కె. నాయుడు తెలిపారు. చిత్రంలో ఐదు పాటలున్నాయని సంగీత దర్శకుడు కనిష్క చెప్పగా, సమర్పకుడు జానీ మాట్లాడుతూ ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేసిన తను తొలిగా ఈ చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగానీ, ఇందులో ఓ హీరోగానూ నటించాననీ తెలిపారు.

దర్శకుడు మహానందిరెడ్డి మాట్లాడుతూ చిత్రం ఆద్యంతం అలరిస్తుందనీ, పాటలూ ఆకట్టుకుంటాయనీ అన్నారు. విజయ్, సూర్యదాస్, మధు, జాని హీరోలుగా; ప్రియాంకా తివారి, ప్రియాంకా నాయుడు, నాగశ్రీ, స్వాతి కొట్టా నాయికలుగా నటించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, నారాయణరావు, జెన్నీ, కళ్లు చిదంబరం, మనోజ్, అమిత్, అల్లరి సుభాషిణి తారాగణం. చంద్రబోస్, చిర్రావూరి పాటలు రాసిన ఈ చిత్రానికి పెమ్మిసాని సురేశ్ సినిమాటోగ్రాఫర్.

No comments:

Post a Comment