
ఇటీవల విడుదలైన పాటలు ప్రజాదరణ పొందాయి. ఈ నెల్లోనే చిత్రాన్ని విడుదల చేస్తాం'' అన్నారు. దర్శకులు వేణు-పాల్ మాట్లాడుతూ "దేశరక్షణ బాధ్యత కేవలం మిలటరీదో, రక్షణ శాఖదో మాత్రమే కాదు ప్రజలందరిదీ అని ఈ చిత్రంలో చెబుతున్నాం.
ఒక రౌడీ కూడా దేశరక్షణ సమస్య వచ్చినప్పుడు దేశం కోసం ఎలా పోరాడాడో ఇందులో చూపిస్తున్నాం. రీరికార్డింగ్‌కు చాలా ప్రాధాన్యత ఉంది. 'అతిధి తుమ్ కబ్ జావోగీ' సినిమాకి పనిచేసిన అస్లామ్ రీరికార్డింగ్ చేశారు'' అన్నారు.
విజయేందర్ గాడ్గే, విశ్వజిత్ ప్రధాన్, దినేష్, 'దిల్' రమేష్, ముస్తాక్‌ఖాన్, గోవా శర్మ, లోబో తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: బండారు దానయ్య, సంగీతం: ధనుంజయ్ మిశ్రా, భోలే చావలి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, కొరియోగ్రఫీ, దర్శకత్వం: వేణు-పాల్.
No comments:
Post a Comment