Saturday, February 5, 2011

మార్చిలో పవన్ కళ్యాణ్, త్రిష, కృతిల "తీన్‌మార్" విడుదల!

అందాల ముద్దుగుమ్మ త్రిష తొలిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో జతకట్టనుంది. ఖుషి, జల్సా వంటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రాలతో యూత్‌లో నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా, తన అందచందాలతో అభినయ వర్షంలో ప్రేక్షకులను తడిసి ముద్ద చేసిన త్రిష కథానాయికగా, మరో గ్లామర్ క్వీన్ కృతి నటించే "తీన్‌మార్" సినిమా మార్చి నెలాఖరున విడుదల కానుంది. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న "తీన్‌మార్" పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్‌ వన్‌గా ప్రముఖ నిర్మాత గణేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు "తీన్‌మార్" అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సిల్వర్ జూబ్లీ దర్శకుడు జయంత్ సి. పరాన్జీ వెల్లడించారు.

నిర్మాత మాట్లాడుతూ.. పవన్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఆయన నటించే చిత్రాల టైటిల్ వుండాలనే వుద్దేశంతోనే మా యూనిట్ సభ్యంలందరం ఆలోచించి తీన్‌మార్ అనే టైటిల్‌ను ఖరారు చేశామన్నారు. ఫిబ్రవరి నాలుగోతేదీతో టాపీ పూర్తవుతుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్‌లో జరుగుతుంది, ఈ షెడ్యూల్‌లో కొమ్మి కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దీని తర్వాత ఎబ్రాడ్‌లో ఓ షెడ్యూల్ చేస్తారు. ఈ షెడ్యూల్ ఫిబ్రవరి నెలాఖరు వరకు జరుగుతుంది. దీంతో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ఈ తీన్‌మార్. ఈ వేసవిలో పవన్ కళ్యాణ్ మరోసారి బాక్సాఫీస్‌ని షేక్ చేయనున్నారు.

మణిశర్మ అందించిన ఆడియో ఇప్పటికే సినీ వర్గాల్లో సంచలనం క్రియేట్ చేస్తుంది. ఈ ఆడియోని మార్చి మొదటివారంలో మార్కెట్లోకి విడుదల చేసి, సినిమాను మార్చి నెలాఖరున విడుదల చేయనున్నామన్నారు. ముఖ్యంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన పంచ్ డైలాగ్స్ పవన్‌కళ్యాణ్ అభిమానులనే కాకుండా సామాన్య ప్రేక్షకుడిని కూడా థియేటర్స్‌లో తీన్‌మార్ వేయించేలా వుంటాయని చెప్పారు.

No comments:

Post a Comment